స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన బన్నీ ఈ సినిమాలో చాలా రఫ్ లుక్‌లో కనిపిస్తాడట.
పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుందని తెలుస్తోంది.ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కనుండగా బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడట.
అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్రపురిలో ఓ వార్త ఇప్పటికే హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలని చూస్తుందట.
కానీ సుకుమార్ మాత్రం తన పాత సెంటిమెంట్ ప్రకారం బన్నీతో తెరకెక్కించిన ఆర్య, ఆర్య2 మాదిరిగా ఈ సినిమాకు కూడా రెండు అక్షరాల టైటిల్‌నే పెట్టాలని చూస్తున్నాడట.మరి ఈ సినిమాకు సుకుమార్ తన పాత సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తాడా లేక కొత్తగా టైటిల్‌ను పెడతాడా అనేది చూడాలి.