పుట్టిన రోజుకు ఏడుపు పాట పెట్టడం వెనక ఇంత పెద్ద కథ ఉందా ?

కే రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, వాణిశ్రీ హీరోయిన్ గా వచ్చిన సినిమా ప్రేమ్ నగర్. ఇది 1971లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఇందులో ఒక పాట కూడా అందరిని ఆకర్షించింది.

 Story Behind Prem Nagar Birthday Song ,prem Nagar,anr,nenu Puttanu Song, Lyricis-TeluguStop.com

“నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా ఈ లోకంతో పని ఏముంది”.పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఈ పాట 70లలో యువతను ఒక ఊపు ఊపింది.

ఈ సినిమా ఘనవిజయం కావడంలో పాటలు సైతం తమ వంతు పాత్ర పోషించాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్నీ కూడా రాసింది ఆత్రేయ.

వాస్తవానికి ప్రకాష్ రావు ఆత్రేయని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.వీరిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాయి.

చాలామంది ఇప్పటికి ప్రకాష్ రావు వల్లే ఆత్రేయకు సినిమా జీవితం వచ్చిందంటే, లేదు లేదు ఆత్రేయ రచనల ద్వారానే ప్రకాష్ రావుకి మంచి సినిమాలు వచ్చాయి అంటూ ఉంటారు.ఇదే విషయాన్ని ప్రకాష్ రావు ని అడిగితే మాత్రం ఆత్రేయకు సినిమా జీవితం ఇచ్చాను అంటే అది నన్ను నేను అవమానించినట్టే అని భావిస్తారు.

అంతలా ఒకరంటే ఒకరికి గౌరవం మర్యాదలు ఉంటాయి.కానీ ప్రేమనగర్ సినిమాకి సంబంధించిన పుట్టినరోజు సందర్భంగా ఒక పాట రాయాల్సిందిగా ఆత్రేయని అడిగాడు ప్రకాష్ రావు.కానీ ఎలాంటి తడబాటు లేకుండా ఆ పుట్టినరోజుకు నేను పాట రాయడమేంటి నేను రాస్తే అది దరిద్రంగా ఉంటుంది అంటూ మొహమాటం లేకుండా చెప్పేసాడట.ఇక ఈ సినిమాకి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు.

ఎంత చెప్పినా కూడా ప్రకాష్ రావు ఓపెనింగ్ సన్నివేశం పూర్తిగా పుట్టినరోజు పాట కావాలని పట్టుబట్టారు.ఆత్రేయ రాయడానికి అస్సలు ఒప్పుకోలేదు మీకు పుట్టినరోజు పాట కావాలంటే వేరే ఎవరితోనైనా రాయించుకోండి అంటూ చెప్పేశారు.

Telugu Nenu Puttanu, Prakash Rao, Prem Nagar-Telugu Top Posts

ఇక గంత్యతరం లేక వేరొక కవిని పిలిపించి ఈ పాట రాయించి పైకమిచ్చి మరీ పంపించేశారు.కానీ పాట విన్నాక అసలు ప్రకాష్ రావుకి నచ్చలేదు.ఎక్కడో ఒక లోటు కనిపిస్తోంది.అది ఏంటో అతనికి అర్థం కాలేదు.మళ్లీ ఆత్రేయనే ప్రకాష్ రావు పిలిపించారు ఏదైనా కష్టపడు, కానీ ఆత్రేయా నాకు మాత్రం పాట కావాల్సిందే అని ప్రకాష్ రావు పట్టుబట్టారు.అసలు నువ్వు పాట రాస్తే దరిద్రంగా ఉంటుంది అని అన్నావు అదేంటో ఒకసారి వినిపించు అని కూర్చున్నారు.

అప్పుడు మొదలు పెట్టారు నేను ఏడిస్తే ఈ లోకం నవ్వింది అంటూ ఇది కదా నాకు కావాల్సిన పాట అంటూ గట్టిగా ఆత్రేయని హత్తుకున్నారు ప్రకాష్ రావు అలా ప్రేమ్ నగర్ లో ఓపెనింగ్ ఇలా పుట్టిన రోజు పాట పెట్టడం వెనక ఇంత పెద్ద కథ జరిగిందన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube