వామ్మో.. బిగ్ బాస్ షోకు స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కు కరోనా నిర్ధారణ కావడంతో తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ 5కు రమ్యకృష్ణ స్పెషల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా చేయడం ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న రమ్యకృష్ణ తెలుగు బిగ్ బాస్ లో నాగార్జున గ్యాప్ తీసుకున్న సమయంలో ఈ హోస్ట్ గా షోలో పాల్గొని మెప్పించారు.

 Star Heroine Ramyakrishna Remuneration For Bigg Boss Show Details Here ,  Ramyak-TeluguStop.com

అయితే తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా రమ్యకృష్ణ భారీ పారితోషికం తీసుకున్నారని బోగట్టా.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోపై ఎన్నో విమర్శలు ఉన్నా యూత్ ను మాత్రం ఈ షో బాగానే ఆకట్టుకుంటోంది.

కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో సీజన్ 5కు తమిళంలో భారీస్థాయిలో రేటింగ్స్ వచ్చాయి.కమల్ కు బదులుగా శృతిహాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా వస్తారని ప్రచారం జరిగినా ఎవరూ ఊహించని విధంగా రమ్యకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వచ్చి తన హోస్టింగ్ తో మెప్పించడం గమనార్హం.

Telugu Bigg Boss Show, Kamal Haasan, Ramyakrishna, Ramya Krishna, Shruti Haasan,

శృతి హాసన్ ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ షోను తాను హోస్ట్ చేయలేనని ఆమె చెప్పారని సమాచారం.ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో సలార్ సినిమాతో పాటు బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూవీతో బిజీగా ఉన్నారు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న రమ్యకృష్ణ కమల్ హాసన్ రిక్వెస్ట్ చేయడంతో ఈ షోకు హోస్ట్ గా ఉండటానికి అంగీకరించారు.

Telugu Bigg Boss Show, Kamal Haasan, Ramyakrishna, Ramya Krishna, Shruti Haasan,

ప్రస్తుతం సినిమాలకు రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున రమ్యకృష్ణ పారితోషికం తీసుకుంటున్నారు.బిగ్ బాస్ షోకు కూడా రమ్యకృష్ణ అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.తన హోస్టింగ్ తో రమ్యకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా రమ్యకృష్ణకు సైతం క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube