బాహుబలి తర్వాత అనుష్క( Anushka ) తెరపై ప్రేక్షకులను సందడి చేసిన దాఖలాలు లేవు ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఈమె వెండితెరపైకి రావడంతో ప్రేక్షకులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కొన్ని కారణాల వల్ల అనుష్క తన సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఈమె పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty ) తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mister Polishetty)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇక చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోయిన్ అనుష్క తెరపై కనిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈ సినిమా ఒక విభిన్న మైనటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితం అవుతున్నటువంటి సమయంలో ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో అనుష్క అన్విత అనే పాత్రలో నటించారు.
అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్నది అనుష్కని కాదు అనే వార్త ఒకటి వైరల్ అవుతుంది.ఈ సినిమా కోసం మరొక హీరోయిన్ ను అనుకోగా ఆమె రిజెక్ట్ చేయడంతోనే ఈ ప్రాజెక్టులో అనుష్క భాగమయ్యారని తెలుస్తుంది.
మరి ఈ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాను చేయనని చాలా సున్నితంగా రిజెక్ట్ చేసినటువంటి హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ).ఈ సినిమా కథ మొత్తం విన్నటువంటి రష్మిక ఇలాంటి పాత్రలో తాను నటిస్తే ప్రేక్షకులకు నెగటివ్ వేలో వెళ్లే అవకాశం ఉంది తద్వారా తన కెరియర్ కి దెబ్బ పడుతుందని భావించినటువంటి రష్మిక ఈ సినిమాని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారట అయితే అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ప్రయోగాత్మ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి అనుష్క మాత్రం ఈ సినిమా కథ విని ఎంతో ఎక్సైట్ అవుతూ ఈ సినిమాకి ఓకే చేశారట.