ఏంటి ప్రదీప్.? శ్రీముఖిని అంత మాట అనేశావ్?

శ్రీముఖి, ప్రదీప్ వీరిద్దరు బుల్లితెర యాంకర్లుగా అందరికీ తెలుసు.వీరిద్దరు స్టేజిపై ఉన్నారంటే అక్కడ సెటైర్లకు కొదవే ఉండదు.

 Sreemukhi,pradeep,sarigamapa Show,song,anchor-TeluguStop.com

ఇద్దరూ తమదైన శైలిలో యాంకరింగ్ చేసి అందరిని ఆటపట్టిస్తున్నారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో దసరా స్పెషల్ ఈవెంట్ ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

దసరా ఈవెంట్ మొత్తం చిరంజీవి ప్రదీప్, చి.ల.సౌ శ్రీముఖి అంటూ ఈవెంట్ ను ఎంతో రచ్చరచ్చ చేశారు.

ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ దసరా ఈవెంట్ టిఆర్పి విషయంలో వెనుకబడి పోయింది.టిఆర్పి తగ్గిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నా, చివరికి యాంకర్లు గా ఉన్న వీరి ఇమేజ్ కాస్త డామేజ్ అయ్యింది.దసరా ఈవెంట్ లో చిరంజీవి ప్రదీప్, చి.ల.సౌ శ్రీముఖి నమస్కరించి రాయునది అంటూ ఆ షో మొత్తం విసిగించేశారు.ఈ షోకి టీఆర్పీ రేటింగ్స్ తగ్గడానికి కారణం మరొకటి కూడా ఉంది.దసరా పండుగ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4 కి సమంత అక్కినేని హోస్ట్ గా నిర్వహించడంతో ఈ ఈవెంట్ కు భారీ దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.

ఈసారి దీపావళి పండుగకు ఎలాంటి ఈవెంట్స్ పెట్టకుండా కేవలం సరిగమ షోలో పాల్గొన్నారు. సరిగమ సింగింగ్ ఐకాన్ షో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.యశస్వి కొండేపూడి అనే యువ గాయకుడి వల్ల ఈ షో ఎంతో పాపులర్ అయింది.ఈ సరిగమ షో కి పలువురు సినీ గాయకులు విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అంతేకాకుండా ఈ దీపావళి ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా శ్రీముఖి ఎంటర్ అయ్యారు.

ఈ సింగింగ్ షో కి గెస్ట్ గా వచ్చిన శ్రీముఖి పాట పాడటంతో ఆమె గాత్రానికి అందరూ ఆశ్చర్యపోయారు. “దివాలి దీపాన్ని” అంటూ అదిరిపోయేలా పాడిన శ్రీముఖికి పై ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసల వర్షం కురిపించారు.ఒకవేళ సింగర్ అయ్యుంటే ఎంతోమంది కనబడకుండా పోయే వారిని కోటి పొగిడారు.

ఈ షోలో ప్రదీప్ శ్రీముఖి ఓ అభిమాని నీ బొమ్మ వేశాడని బొమ్మను చూపించాడు.అది బర్రెలా ఉంది నేను ఎలా ఉన్నాను అని శ్రీముఖి ఫైర్ అయ్యింది.

సేమ్ టు సేమ్ దాని పెదాలు.నీ పెదాలు ఒకేలా ఉన్నాయంటూ కౌంటర్ వేశాడు.

కానీ బర్రె కంటే బాగున్నాయ్… నువ్వు అందమైన బర్రె అంటూ శ్రీముఖి పరువు మొత్తం తీసేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube