న్యూయార్క్: మన్‌హట్టన్‌లో మూడు రోజుల పాటు దీపావళీ వేడుకలు.. దక్షిణాసియా ఫౌండేషన్ ప్రకటన

భారతీయుల పండుగలలో దీపావళికి ప్రత్యేక స్థానముంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

 South Asian Engagement Foundation Announces ‘all-american Diwali’ In Lower M-TeluguStop.com

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.

ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దీవాళీని జరుపుకుంటున్నారు.ఇక భారతీయులకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.

అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక ఈ ఏడాది దీపావళీ వేడుకలకు సంబంధించి దక్షిణాసియా ఎంగేజ్‌మెంట్ ఫౌండేషన్ (saef-us.org) కీలక ప్రకటన చేసింది.

ఈ ఏడాది మన్‌హట్టన్‌లో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని వెల్లడించింది.దీనికి ‘‘All-American Diwali’’ అని పేరు పెట్టినట్లు ఓ ప్రకటన ద్వారా నిర్వాహకులు చెప్పారు.

నవంబర్ 2, 3, 4 తేదీల్లో సాయంత్రం నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ వేడుకలు జరుగుతాయని.తర్వాత దీవాళీ ప్రతీకను తెలిపే యానిమేటెడ్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

అలాగే నవంబర్ 3న హడ్సన్‌లోని పియర్ డీ , జెర్సీ సిటీ, లోయర్ మన్‌హట్టన్‌ వద్ద క్రాకర్స్‌ను కాల్చనున్నారు.వీటిని వీక్షించాలంటే జెర్సీ నగరంలోని గ్రండీ పార్క్, దిగువ మన్‌హట్టన్‌లోని రాక్‌ఫెల్లర్ పార్క్‌ మంచి ప్రదేశాలని టాక్.

#AllAmericanDiwali సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీపావళీ రోజున ప్రతి ఒక్కరూ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు .

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube