మొన్నటి వరకు బుల్లితెరపై బాగా సందడి చేసిన సీరియల్ కార్తీకదీపం.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఇందులో నటించిన నటీనటులు మాత్రం ఇప్పటికి గుర్తున్నారు.వాళ్ళని ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు.ముఖ్యంగా అందులో విలన్ పాత్రలో నటించిన మోనిత ను మాత్రం అసలు వదలటం లేదు.ఈ సీరియల్ ద్వారానే మోనితకు మంచి అభిమానం ఏర్పడింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మోనిత ఒక వీడియో పంచుకోగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.
మోనిత అసలు పేరు శోభ శెట్టి.ఈమె కన్నడకు చెందిన ముద్దుగుమ్మ.తొలిసారిగా శోభ శెట్టి కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా అడుగు పెట్టింది.ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు కార్తీకదీపం తోనే అందుకుంది శోభ.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.
ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించగా ఆ సీరీస్ బాగా ఆకట్టుకుంది.
ఇన్ స్టా లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ట్రెడిషనల్ దుస్తులు ధరించి వాటి ద్వారా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక కార్తీకదీపం సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమె అభిమానులు ఈమెను మోనిత అని పిలుస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో బిజీగా ఉంది.అంతేకాకుండా కొన్ని వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఉంది.అలా నిత్యం బిజీ లైఫ్ తో గడుపుతూ ముందుకు సాగుతుంది.
ఇక యూట్యూబ్లో తను ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఏ చిన్న పని చేసినా కూడా వెంటనే తన ఫాలోవర్స్ కు తెలిసేలా చేస్తుంది.
అయితే తాజాగా తను యూట్యూబ్లో ఒక వీడియో పంచుకుంది.ఆమె మొదటిసారి ఆదివారం రైతు బజార్ కి వెళ్లి బేరం ఆడి కూరగాయలు కొన్నాను అని తెలిపింది.ఇక ఆ వీడియోలో తను మాస్క్ పెట్టుకొని కూరగాయలు కొంటూ కనిపించింది.తను మాస్క్ తీసి తన ఫేస్ చూపించటంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.ఆ వీడియో చూసిన తన ఫాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.
అంతేకాకుండా బాగా బేరం చేశారు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.