గాయనిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి స్మిత.తెలుగులో ఆల్బమ్స్ లేని సమయంలో పాప్ సాంగ్స్ టాలీవుడ్ కి పరిచయం చేసిన ఈ అమ్మడు.
తరువాత తనదైన శైలిలో పాటలు పాడుతూ మంచి గాయనిగా గుర్తింపు సొంతం చేసుకుంది.అలాగే మల్లీశ్వరి సినిమాలో నటిగా కూడా ఈ భామ మెప్పించింది.
ఈ మధ్యకాలం సినిమాలకంటే సొంత ఆల్బం సాంగ్స్ ఎక్కువ చేసుకుంటూ సోషల్ మీడియాలో స్మిత తన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటుంది.ఆ మధ్య శివుడు మీద చేసిన ఆమె చేసిన ఆల్బమ్ సాంగ్స్ కి యుట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు స్మిత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఒటీటీ ద్వారా ఓ సోషల్ కాన్సెప్ట్ తో టాక్ షో ప్లాన్ చేస్తుంది.ఈ టాక్ షోకి సంబందించిన తాజాగా ఆమె వివరాలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
తాను యువర్ హానర్ అనే సోషల్ షోను నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కార్యకర్తలు, సాధారణ పౌరులు మొదలైన వారితో ఈ టాక్ షో నడుస్తుందని తెలిపింది.
ఈ టాక్ షోకి సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే ఈ సందర్భంగా ఆమె షేర్ చేసుకుంది.అయితే కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది.అందులో ఏ అంశాల మీద చర్చ ఉంటుంది అనే విషయాలని రివీల్ చేయలేదు.అయితే స్మిత తన టాలెంట్ తో ఈ ప్రదర్శనను విజయవంతం చేస్తుందని భావిస్తున్నారు.
యువర్ ఆనర్ త్వరలో ప్రముఖ ఒటీటీలో ప్రసారానికి సిద్దమవుతోంది.