మలింగాపై సంచలన ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి.! తలుపు తీసిన మలింగా నన్ను బెడ్ పైకి తోసేశాడు. అనంతరం నాపైకి.!  

చిన్మయి…మంచి సింగర్ కంటే సమంత కి వాయిస్ ఇచ్చిన సింగర్ అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. ‘ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పి సమంత కి కుర్రకారులు ఫ్లాట్ అవ్వడానికి పరోక్షంగా కారణంగా మారింది చిన్మయి. తర్వాత హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లిచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండవుతున్న #MeToo‌లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో క్రికెటర్ భాగోతాన్ని బయటపెట్టారు చిన్మయి.

Singer Chinmayi Sensational Comments On Cricketer Malinga-

Singer Chinmayi Sensational Comments On Cricketer Malinga

తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరిన బాధితురాలు మలింగా తనతో ఎలా ప్రవర్తించాడో పోస్టులో వర్ణించింది. ‘‘కొన్నేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్‌లో నా స్నేహితురాలితో కలిసి దిగాను. అదే హోటల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగా కూడా దిగాడు. ఓరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా గదిలో ఉందని చెప్పారు. నేను వెంటనే అక్కడకు వెళ్లాను. అయితే అక్కడ ఎవ్వరూ లేరు. తలుపు తీసిన మలింగా నన్ను బెడ్ పైకి తోసేశాడు. అనంతరం నాపైకి వచ్చి ముఖాన్ని తడిమాడు. అతడిని ప్రతిఘటించే శక్తి లేకపోవడంతో గట్టిగా కళ్లు మూసుకుని ఉండిపోయాను. అప్పుడే హోటల్ స్టాఫ్ వచ్చి డోర్ కొట్టారు. అతను డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాడు.

Singer Chinmayi Sensational Comments On Cricketer Malinga-

నేను వెంటనే వాష్ రూమ్‌లోకి పరిగెత్తాను. ఫేస్ వాష్ చేసుకుని హోటల్ స్టాఫ్ వెళ్లిన వెంటనే నేను ఆ గదిలో నుంచి వెళ్లిపోయాను. ఈ విషయం నేను బయటకు చెప్తే నువ్వు కావాలనే అతని రూమ్‌కి వెళ్లావు అని నన్ను అవమానిస్తారు.

Singer Chinmayi Sensational Comments On Cricketer Malinga-

ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా ‘నీకు తెలిసే వెళ్లావు’ ‘అతను ఫేమస్ వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడుతున్నావ్’ ‘నవ్వు కావాలనుకునే అతని గదిలోకి వెళ్లావ్ కదా’ అంటూ విమర్శిస్తారని నాకు తెలుసు. అయినా సరే నేను నిజాన్ని బయటపెడుతున్నా’’ అని సదరు యువతి ట్వీట్ చేసింది. దీన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది.