సముద్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా గాని దాని పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.ఒకేసారి నీరు, నిప్పు కలిసి సముద్రంలో అల్లకల్లోలం సృష్టించాయి.
అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం వలన ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే కొన్ని లగ్జరీ కార్లు నీళ్ల పాలయ్యాయి.వివరాల్లోకి వెళితే.
జర్మనీ ఎండెన్ నుంచి అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని డేవిస్‌విల్లే పోర్టుకు కొన్ని లగ్జరి కార్లను తీసుకెళ్తున్న భారీ నౌక పొర్చోగల్‌లోని అజోర్స్ దీవుల సమీపంలోనీ అట్లాంటిక్ మహా సముద్రంలో అగ్నిప్రమాదంలో చిక్కుకుంది.
ఈ క్రమంలోనే షిప్‌లోని కార్లనీ అన్ని కూడా తగలబడి పోయాయి.
అయితే కార్గొ షిప్లో మంటల్లో చిక్కుకున్న ఒక్కో కారు కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది అంటే నష్టం ఎంత వచ్చిందో అంచనా వేయండి.ఈ కార్లను వివిధ దేశాల్లోని షోరూమ్ లకు తరలించే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.11 వందలకు పైగా లంబోర్గిని కార్లు ఉండగా, మిగతావి పోర్షే, ఆడి కార్లు ఉండడం గమనార్హం.బుధవారం జర్మనీ నుంచి ఈ షిప్ స్టార్ట్ అవ్వగా గురువారం రాత్రి సమయంలో అజోర్స్ దీవుల సమీపంలో నౌకలో ఉవ్వేత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పోర్చుగీస్ నేవీ,ఎయిర్‌ఫోర్స్ టీమ్‌లు రెస్కూ ఆపరేషన్ ను మొదలుపెట్టాయి.
విషయం తెలిసి హుటాహుటిన హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టి 22మంది సిబ్బందిని కాపాడారు.వారిని 170 కిలోమీటర్ల దూరంలో మరో దీవికి తీసుకెళ్లారు.ప్రాణ నష్టం అయితే వాటిల్లలేదు కానీ ఆస్థి నష్టం జరిగింది.
ఎన్నో కోట్ల రూపాయిల ఆస్థి నీటి పాలవుతుంటే రెస్క్యూ టీమ్ ఏమీ చేయలేక పోయారు.మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్లో కెనడాకు పంపించాలని భావించినా అనుకోని విపత్తు వాటిల్లడంతో మధ్యలోనే ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లిందని వోక్స్ వ్యాగన్ ప్రతి నిధులు చెబుతున్నారు.
కాగా షిప్లో మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు.