తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఎన్టీఆర్ నాగేశ్వరావు కృష్ణ శోభన్ బాబు లాంటి హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్న ఆ సమయంలో వాళ్లతో పాటు హీరోయిన్లుగా చాలా మంది కెరీర్ స్టార్ట్ చేశారు అందులో సావిత్రి గారు చాలా సినిమాల్లో ఎన్టీఆర్ నాగేశ్వరరావు జోడిగా నటించి మంచి పేరు సంపాదించింది.హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న టైంలో జెమినీ గణేషన్ గారిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
అయితే సావిత్రి గారు తర్వాత ఇండస్ట్రీలో యాక్టింగ్ బాగా చేసే నటి ఎవరైనా ఉన్నారు అంటే అది షావుకారు జానకి అనే చెప్పాలి.
హీరోయిన్స్ అందరూ పెళ్లి కాకముందు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా స్థిరపడి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు కానీ షావుకారు జానకి మాత్రం దానికి విరుద్ధంగా ముందు పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కన్న తర్వాత బిడ్డ ఆకలి తీర్చడానికి ఏం చేయాలో తెలియక సినిమాల్లో నటించారు.
మొదటగా షావుకారు సినిమాలో నటించిన తనకి షావుకారు జానకి అనే పేరు వచ్చింది మొదటి సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు జానకి.జానకి గారు తెలుగులో మంచి నటిగా గుర్తింపు సాధించినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
నాగేశ్వరరావు దేవదాసు సినిమాలో మొదట హీరోయిన్ గా షావుకారు జానకిని తీసుకున్నప్పటికీ ఆ తర్వాత వేరే వాళ్ళనీ ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు.అలాగే చాలా సినిమాల్లో ముందు అవకాశాలు వచ్చినప్పటికీ తర్వాత వేరే వాళ్ళని తీసుకున్నారు.
తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు పుట్టాక కొన్ని రోజులకి భర్త శ్రీనివాస రావు గారితో విభేదాల కారణంగా విడిపోయారు అయినప్పటికీ ఎక్కడ అధైర్య పడకుండా తన ముగ్గురు పిల్లలను చదివించి వాళ్లను గొప్ప వారిని చేశారు.
అలాగే తన భర్త అయినా శ్రీనివాస రావు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన కు ఆరోగ్యం బాగా లేకపోతే ఆవిడ ఇంటి దగ్గర నుంచి టిఫిన్స్ లంచ్ అరేంజ్ చేసి ఇచ్చేవారు.ఒకరోజు షావుకారు జానకి గారు సింగపూర్ లో షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా శ్రీనివాస రావు గారికి ఆరోగ్యం బాగా లేదు అంటే చెన్నైలో ఉన్న ఒక హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ చేపించారు అప్పటికి వాళ్ళిద్దరూ విడిపోయారు ఆవిడ ఒక మనిషిని నమ్మితే వాళ్లు ఆవిడ నుంచి విడిపోయిన కూడా చాలా బాగా చూసుకుంటారని చాలామంది అంటుంటారు.షావుకారు జానకి గారికి తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోవడానికి ఇక్కడ జరిగిన కొన్ని రాజకీయాలే కారణం అని ఆవిడ ఎప్పుడు చెబుతుంటారు.
అయితే ఆవిడ తమిళంలో టాప్ హీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది.
సినిమాకి సంబంధించి ఆవిడ చాలా గొప్పగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది హిందీలో మమత అనే సినిమా అక్కడ మంచి హిట్ అవడంతో రీమేక్ రైట్స్ ని షావుకారు జానకి కొనుగోలు చేసి కె బాలచందర్ గారి డైరెక్షన్లో కావ్య తలై అనే సినిమాగా తీశారు అది తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
దాంతో ఆవిడకి ఎల్ వి ప్రసాద్ గారు ఫోన్ చేసి నేను హిందీలో మమత సినిమా చూశాను తమిళంలో నువ్వు చేసిన కావ్య తలై సినిమా చూశాను అందులో సుచిత్ర సీన్ గారు చేసిన దానికంటే నువ్వు బాగా చేస్తావ్ అని మెచ్చుకున్నారు ఇప్పటికీ తనకు అదే బెస్ట్ మూమెంట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.అయితే తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తికి ఆవిడ ఒక ఇల్లు కొని ఇచ్చారు రోజు తన ఇంట్లో పనిచేసే పనివారు తిన్న తర్వాతే ఆవిడ అన్నం తింటారు.
ఎంతైనా ఆవిడకి తమిళంలో దక్కిన గౌరవం తెలుగులో దక్కలేదనే చెప్పాలి తమిళ్లో ఆవిడకి ఎంజీఆర్ అవార్డు ఇచ్చి సత్కరించారు.