నేడు ఢిల్లీకి షర్మిల ? ఆ క్లారిటీ వచ్చేనా ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS sharmila ) పరిస్థితి అగమ్య గోచరంగా మారింది .తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె అష్ట కష్టాలు పడుతున్నారు.

 Sharmila To Delhi Today  Will That Clarity Come , Ys Sharmila, Ysr Telangana Par-TeluguStop.com

ముందుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు అంగీకారం తెలిపినా,  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు,  మరికొంతమంది సీనియర్లు షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి రనివ్వ వద్దని, ఆమెను ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని అధిష్టానం వద్ద ఒత్తిడి చేయడంతో,  షర్మిల పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోయింది.ఇటు ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి .కాంగ్రెస్ లో వీలైన ప్రక్రియ రోజు రోజుకు ఆలస్యం అవుతుండడం , మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో,  షర్మిల ఆందోళన చెందుతున్నారు.విలీన ప్రక్రియ అంశంపై ఏదో ఒక క్లారిటీ తీసుకునేందుకు ఆమె నేడు ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం .సోనియా,  రాహుల్ తో సమోసమై తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించబోతున్నారట.

Telugu Ap, Dk Siva Kumar, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telang

ఇక కాంగ్రెస్ పార్టీలోనూ షర్మిల సేవలను ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై క్లారిటీ రావడం లేదు .ఇప్పటికే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్( DK Shiva Kumar ) షర్మిల తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో షర్మిల ఢిల్లీ పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో,  వీలైనంత త్వరగా షర్మిల పార్టీని విలీనం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

Telugu Ap, Dk Siva Kumar, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telang

 అయితే ఆమె తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని, ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనంటూ భీష్మించుకోవడంతోనే , ఆమె పార్టీ విలీన ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను( Conress party ) ప్రకటించక ముందే తాను ఏదో ఒక క్లారిటీ కాంగ్రెస్ పెద్దల నుంచి తీసుకోవాలని,  లేకపోతే రాజకీయ భవిష్యత్తు గొందరగోళంలో పడుతుందనే భయమూ షర్మిల లో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube