ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయిదని చెప్పాడొక మహానుభావుడు.అతడు ఏం ముహూర్తాన చెప్పాడో తెలియదు కానీ నేడు అది నిజమై కూర్చుంది.
అవును, స్మార్ట్ ఫోన్ నేటి స్మార్ట్ యుగాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తోంది.అదేవిధంగా సోషల్ మీడియా విస్తరణ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.
ఇక్కడ నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా ఓ జింక వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో జింక చాలా తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు రావడం గమనించవచ్చు.
ఆ జింక చాకచక్యంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను తీవ్రంగా అలరిస్తోంది.
IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత నంద ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.ఆటగాడు పోస్టు చేస్తూ ఓ టెక్స్ట్ కూడా చేసారు.
అదేమంటే “సమర్థత అనేది కేవలం నైపుణ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది వైఖరికి సంబంధించింది కూడా.బతకడానికి ఈ వైఖరి అనేది ఉపయోగపడుతుంది.ఈ జింక తన కొమ్ములతో ప్రదర్శించిన యుక్తిని చూడండి” అని సుశాంత నంద రాసుకొచ్చారు.
ఇకపోతే సదరు వీడియోలో ఓ జింక బారియర్ గేటు దాటుకుని బయటకు రావాలని శతవిధాలా ప్రయత్నించడం మనం చూడవచ్చు.ఆ జింక మొదట తన కుడివైపు కొమ్ములను బారియర్ గేటు కింద నుంచి బయటకు తీసి, తరువాత చాలా తెలివిగా ఎడమవైపు కొమ్ములను కూడా బయటకు తీయడం గమనించవచ్చు.ఆ తర్వాత తన శరీరాన్ని కిందకు వంచి బారియర్ గేటు దాటుతుంది.
అచ్చం మనిషిలా ఆ జింక ఆలోచించినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేయడం ఇక్కడ చూడవచ్చు.గతంలో కూడా చాలా సార్లు ఇటువంటి వీడియోలను అతను పోస్ట్ చేశారు.