సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది.ఈ సమయం కోసమే కళ్ళు కాయలు కాచేలా రెండేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు.
మరి ఆ సమయం వచ్చింది.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి నిన్న ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
నిన్న సాయంత్రం మేకర్స్ ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మహేష్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అంత కన్నా డబల్ అందంగా, మాస్ హీరోలా చూపించి ప్రేక్షకులను ఖుషీ చేసాడు పరశురామ్.ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి కొద్దీ సేపు మాత్రమే అవుతున్న భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.
మొన్నటి వరకు మహేష్ తన సినిమాల్లో సబ్టిల్ యాక్టింగ్ తో మెప్పించాడు.అయితే సర్కారు సినిమాతో ఒక్కసారిగా తన లోని మాస్ ను మరోసారి బయటకు తీసి కొద్దిగా రుచి చూపించాడు.
అందరు అంచనాల కన్నా కొద్దిగా ఎక్కువగానే ఈ ట్రైలర్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టు కోవడంతో ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ లభించింది.
నిన్న సాయంత్రం రిలీజ్ అయినా ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.గ్రాండ్ ఈవెంట్ చేసి మరీ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.రిలీజ్ తర్వాత అంతే గ్రాండ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.
ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు కూడా గడవక ముందే ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడమే కాకుండా ఏకంగా 1 మిలియన్ లైక్స్ రావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక 24 గంటలు గడిచే సరికి ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.