సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా చాలా కారణాల వల్ల వెళ్లలేక పోయింది.
ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసి.మహేష్ బాబుపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా త్రివిక్రమ్ చిత్రీకరించాడు.
అయితే ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది అనుకున్న సమయంలోనే మహేష్ బాబు మదర్ ఇందిరా దేవి గారు మరణించడంతో షూట్ కు బ్రేక్ పడింది.ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా మహేష్ సినిమాతో కేజిఎఫ్ సినిమాకు లింక్ పెడుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ తో విలన్ పాత్రను చేయించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.మరి ఆ బాలీవుడ్ విలన్ ఎవరు అనే విషయంపై కేజిఎఫ్ 2 లో కీలక రోల్ లో కనిపించిన సంజయ్ దత్ అని తెలుస్తుంది.
దీంతో కేజిఎఫ్ విలన్ మహేష్ సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.ఇలా కేజిఎఫ్ తో మహేష్ సినిమాకు లింక్ పెడుతున్నారు.కేజిఎఫ్ పుణ్యమా అని సంజయ్ దత్ కూడా సౌత్ లో వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు.ఇలా ఈయన ప్రయాణం కేజిఎఫ్ తర్వాత స్పీడ్ గా దూసుకు పోతుంది.