సమంత, నయనతార బస్సు ప్రయాణం.. మాములుగా లేదుగా!

ఫుట్ బోర్డు మీద ప్రయాణం ప్రమాదకరమని మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కోసం బస్సు లోపల ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అనే కొటేషన్ మనకు కనిపిస్తుంది.

 Samantha Nayantara On A Footboard Journey Samantha, Nayanatara, Tollywood, Footb-TeluguStop.com

సాధారణంగా సినీ తారలు ఇలాంటి విషయాల గురించి మనకు అవగాహన కల్పిస్తుంటారు.కానీ అలాంటి సినీతారలు ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది.

అవును సమంతా నయనతార బస్సులో ప్రయాణం చేస్తూ ఫుట్ బోర్డు పై నిలబడ్డారు.అయితే ఇదంతా నిజంగా అనుకుంటే పొరపాటే.

ఇదంతా ఒక సినిమా షూటింగ్లో భాగంగా వీరిరువురు ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చేశారు.

విగ్నేష్ శివన్ దర్శకత్వం సమంత, నయనతార కలిసి నటిస్తున్నటువంటి చిత్రం కాతువాకుల రెండు కాదల్‌‘ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా షూటింగ్లో భాగంగా సమంత నయనతార విజయ్ సేతుపతి పై కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ఈ షూటింగులో భాగంగా బస్సులో ప్రయాణిస్తునటువంటి సమంతా నయనతార విజయ్ సేతుపతి ఫుట్ బోర్డు పై నిలబడి ప్రయాణం చేస్తుంటారు.ఈ వీడియోలో నయనతార – సమంత తెలుపు రంగు చీరలను ధరించి సందడి చేయగా విజయ్ సేతుపతి తెలుపు రంగు చొక్కా , నలుపు రంగు పాయింట్ వేసుకొని కనిపించారు.ప్రస్తుతం వీరు ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చేస్తున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే ఈ ముగ్గురు సెలబ్రిటీలు పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube