అదృష్టానికి టైమ్ అంటూ ఉండదు.ఎందుకంటే అది ఎప్పుడు ఏ రూపంలో ఎలా మన జీవితాన్ని మార్చేస్తుందో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు.
కాగా అది మన ఇంటి తలుపు తట్టినప్పుడు వెంటనే అలర్ట్ అయిపోయి దాన్ని సాదరంగా మన ఇంట్లోకి ఆహ్వానించావలి.లేదంటే మళ్లీ అది ఎప్పుడు మన ఇంటి తలుపు తడుతుందో చెప్పలేం.
ఎందుకంటే దురదృష్టం వంద సార్లు తలుపులు తడితే అదృష్టం మాత్రం ఎప్పుడు తడుతుందో ఎవరూ చెప్పలేము.అయితే ఇప్పుడు అదృష్టం గురించి ఎందుకు చెప్పడం అంటారా అలాంటి దే ఇప్పుడు జరిగింది మరి.
ఇప్పుడు అదృష్టం ఓ పదమూడేళ్ల అమ్మాయి జీవితాన్ని మార్చేసింది.అయితే ఆమెకు ఆ అదృష్టం మాత్రం తాను టైంపాస్‌గా తెచ్చుకుని తినే చిప్స్ రూపంలో కలిగింది.కాగా రెగ్యులర్‌గా తాను తినే చిప్ లాగే ఓ రోజు కూడా తింటుండగా ఆ చిప్స్ ప్యాకెట్ లో ఆమెకు ఓ చిప్ వెరైటీగా కనిపించింది.ఇంకేముంది దాన్ని ఆమెకు అస్సలు కొరకాలనిపించలేదు.
దాన్ని ఓ మెమొరీగా దాచుకోవాలని అనుకుంది.ఇక దాన్ని ఓ వీడియో తీసేసేఇ వెంటనే టిక్ టాక్‌లో అప్ లోడ్ చేసేసింది.
ఇక దాన్ని చూసిన వారంతా కూడా దాన్ని వేలం వేయాలంటూ సలహా ఇచ్చారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో నివాసం ఉండే ఈ 13 ఏళ్ల బాలిక ఆ చిప్‌ను వారు చెప్పినట్టే ఈబే సైట్‌లో ఆ డిఫరెంట్ చిప్‌ను లిస్ట్ చేసింది.అయితే ఆలూ చిప్ మాదిరిగా ఉండే దాన్ని ఆమె కేవలం డాలర్ కంటే తక్కువ రేటుకు మెన్షన్ చేసింది.కానీ ఆమె ఊహించని విధంగా 14 లక్షల వరకు అనగా రెండువేల డాలర్ల దాకాదాని విలువ పెరగడంతో సదరు కంపెనీనే దాన్ని కోట్ చేసి మరీ కొనుగోలు చేసింది.
ఎందుకు అని అడగ్గా ఆ బాలికకు చెందిన ఇంటి వాళ్లు తమ చిప్స్ బాగా తింటారని అందుకే ఇలా వారి కృతజ్ఞత తెలుపుకుంటామని తెలిపింది కంపెనీ.
.