విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇటీవల సినిమా షూటింగ్ ని కాశ్మీర్లో నిర్వహిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేశారు.
సమంత పుట్టిన రోజు కాశ్మీర్ లొకేషన్ లో నిర్వహించినట్లు గా యూనిట్ సభ్యులు విడుదల చేసిన వీడియోలో వెల్లడి చేయడం జరిగింది.ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే మొదటి షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది.
ఒకటి రెండు రోజుల్లో కాశ్మీర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్కు తిరిగి రాబోతున్నట్లు గా తెలుస్తోంది.ఎండా కాలం పూర్తయిన తర్వాత అంటే మే నెల తర్వాత జూన్ చివరి వారంలో లేదా మూడో వారంలో మళ్లీ హైదరాబాద్లో తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
సమంతా ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.విజయ్ దేవరకొండ మరియు శివ నిర్వాణ కాంబో లో సినిమా అంటూ రెండు సంవత్సరాల క్రితమే ప్రకటన వచ్చింది.
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తుండగా.ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో సినిమా ప్రారంభమవడం, ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
సినిమాలో కీలక పాత్రలో వెన్నెల కిషోర్ కూడా కనిపించబోతున్నాడు.మజిలీ వంటి విభిన్నమైన సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ అదే తరహా ప్రేమ కథ తో ఈ సినిమా ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.
ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ సినిమా విడుదలైన రెండు మూడు నెలల్లోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా టైటిల్ ని అతి త్వరలోనే శివ నిర్వాణ ప్రకటించే అవకాశాలున్నాయి.