సమంత, సిద్దార్థ్ ల జబర్దస్త్ సినిమా ఎందుకు వివాదానికి దారి తీసిందో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.సమంత విడాకులు తీసుకున్న తరువాత నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకమైన పోస్టులు, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంది.

 Samantha And Siddharth S Jabardasth Completes 9 Years Samantha, Siddharth, Jabar-TeluguStop.com

విడాకుల తర్వాత సమంత ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సమంత నటించిన జబర్దస్త్ సినిమా విడుదల ఫిబ్రవరి 28 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది.అయితే ఈ సినిమా పెద్ద వివాదాన్ని సృష్టించింది.

వివాదాలు ఎందుకు వచ్చాయి?ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత నాగ చైతన్య తో ప్రేమలో పడక ముందు హీరో సిద్ధార్థ తో కలిసి కొద్దిరోజుల పాటు ప్రేమాయణం సాగించింది.

ఆ తరువాత వాళ్ళిద్దరూ వివాదాల కారణంగా విడిపోయారు.ఈ క్రమంలోనే సమంత సిద్ధార్థ్ కలిసి ఉన్నప్పుడు వారు జబర్దస్త్ అనే సినిమాలో నటించారు.ఇక ఆ సినిమా 2013లో విడుదల అయింది.ఆ సమయంలో అప్పుడప్పుడే డైరెక్టర్ గా నిలదొక్కుకుంటున్న దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా అనౌన్స్ చేసిన సమయానికి సమంత సిద్ధార్థ్ సాలిడ్ రిలేషన్ లో ఉన్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 22, 2013న థియేటర్ లలో విడుదలయింది.

సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమా బ్యాండ్ భాజా భరత్ అనే సినిమాను పోలి ఉంది కాఫీ చేశారు అంటూ ఆరోపణలు వినిపించాయి.ఇదే విషయం ఫై యష్ రాజ్ ఫీలిమ్స్ సంస్థ కోర్టు మెట్లు కూడా ఎక్కింది.జబర్దస్త్ సినిమాలోని చాలా సన్నివేశాలు బ్యాండ్ బాజా భారత్ సినిమాను పోలి ఉన్నాయని గుర్తించిన కోర్టు స్టే విధించింది.జబర్దస్త్ చిత్రాన్ని డబ్ చేయకూడదని, డివిడి, టీవీలలో ప్రసారం చేయకూడదు అని కోర్టు స్టే ఇచ్చింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొంత కాలానికి సమంత, సిద్ధార్థ్ విడిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube