అతనికి నాకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది.. మాజీ ప్రియురాలు కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఐదు పదుల వయస్సు దాటినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నారు.

 Salman Ex Somy Ali Reveals What She Learned From Parents Details, Salman Khan,-TeluguStop.com

పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ హీరో మాత్రం ఎంతో మందితో ఎఫైర్స్ నడిపి సంచలనంగా మారారు.ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ గురించి మనకు తెలిసిందే.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తన తన తల్లిదండ్రుల నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకున్నానని అలాగే సల్మాన్ ఖాన్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు అతని నుంచి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

అయితే అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు సంతోషంగా లేకపోతే ఆ రిలేషన్ నుంచి విడిపోవడమే మంచిదని భావించి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న సంగతి కూడా ఈమె బయటపెట్టారు.

ఈ సందర్భంగా సోమీ అలీ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల నుంచి తాను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నానని వారిలో నచ్చిన విషయం ఏమిటంటే వారి ఇంటికి ఎంతో మంది అతిథులు వస్తున్నప్పటికీ వారు ఎంతో ప్రేమగా పలకరించి వారికి భోజనం పెట్టి పంపిస్తారని ఈమె తెలిపారు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి తాను నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటి అనే విషయానికి వస్తే మనమంతా ఒక్కటే అనే విషయాన్ని తాను నేర్చుకున్నట్లు ఈమె తెలిపారు.సల్మాన్ ఖాన్ నుంచి తాను దూరమైనప్పటికీ ఇప్పటికీ తనతో తనకి మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా సోమీ అలీ సల్మాన్ ఖాన్ గురించి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube