కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ( Prabhas )హీరోగా నటించిన తాజా చిత్రం సలార్.అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే సలార్ సినిమా కోసం మా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
సలార్ రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుండగా అందులో పార్ట్ వన్ డిసెంబర్ 22 న విడుదల కానుంది.తాజాగా సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే కొందరు ఈ మూవీ ట్రైలర్ ని చూసి సూపర్, బ్లాక్ బస్టర్ అంటుండగా ఇంకొందరు మాత్రం ఈ సినిమా ట్రైలర్ ఏమీ బాగోలేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విడుదల చేసి దగ్గర పడుతున్నడంతో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదోక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.కాగా సలార్ సినిమా సెన్సార్ రిపోర్ట్ అలాగే రన్ టైమ్ వివరాలు బయటకు వస్తున్నాయి.సినీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే సలార్ సెన్సార్ పూర్తి అయిందని,సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ఎ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
అలాగే, సినిమా ట్రైలర్ లో హింట్ ఇచ్చినట్టుగానే టీమ్ భారీ యాక్షన్ డోస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.ఇక సెన్సార్ అయ్యాక సలార్( Salaar movie ) రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్.ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో వచ్చే వీకెండ్ లో సలార్ 2వ ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.సలార్ లాంటి భారీ సినిమా కోసం టీమ్ దూకుడు ప్రమోషన్స్ చేయాల్సి ఉంది కానీ ఇప్పటి దాకా అలాంటిది ఏమీ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.
కానీ ఎట్టకేలకు సలార్ సెన్సార్ రిపోర్ట్ రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో వారు సంతోషంగా ఉన్నారు.ఇండియన్ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా క్రేజ్ ఉన్న సినిమాల్లో సలార్ మొదటి వరుసలో ఉంది.
కొద్ది రోజుల క్రితం ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.ఖాన్సార్ అనే ఒక రాజ్యాన్ని చూపడంతో పాటు సినిమా లైన్ ఏంటి అనే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రభాస్ నటించిన ఈ సినిమా రెండు సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉంది, యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.