రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని చాలామంది మేధావులు చెప్పుకొస్తున్నారు.శక్తివంతమైన రష్యా… చేస్తున్న దాడులకి ఇప్పటికే ఉక్రెయిన్ అంధకారంలోకి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో ఉక్రెయిన్ వాసులు సైతం దేశం విడిచి పారిపోతున్నారు.దాదాపు సంవత్సరం నుండి జరుగుతున్న దాడులలో ఉక్రెయిన్ తో పాటు రష్యా కూడా భారీగానే మూల్యం చెల్లించుకుంది.
రష్యా ట్యాంకర్ లు, యుద్ధ విమానాలు కోల్పోగా .ఇంకా సైనికులు చాలామంది చనిపోయారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 89 మంది సైనికులు మరణించినట్లు రష్యా స్పష్టం చేసింది.విషయంలోకి వెళ్తే రష్యా ఆక్రమిత ప్రాంతమైన డోనస్కో లోనీ మాకివ్కా పై ఉక్రెయిన్ దళాలు ఇటీవల భీకర దాడులు చేయడం జరిగింది.
ఓకే భవనంలో రష్యా సైనికులు సేదతీరుతున్న సమయంలో ఆ భవనంపై.ఉక్రెయిన్ దళాలు ఒక్కసారిగా రాకెట్లతో విరుచుకుపడ్డాయి.దీంతో తాము జరిపిన దాడిలో 300 నుండి 400 మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.అయితే ఈ దాడి ఘటనపై రష్యా మాత్రం 89 సైనికులు మాత్రమే మరణించినట్లు వెల్లడించింది.