కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు రిజర్వ్..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో విచారణ జరిగింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

 Rouse Avenue Court Reserved Judgment On Kejriwal's Medical Checkup , Ed ,arvind-TeluguStop.com

ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జైలులో కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే చక్కెర లెవల్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కేజ్రీవాల్ తీసుకుంటున్నారని ఈడీ( ED ) సంచలన ఆరోపణలు చేసింది.

మరోవైపు జైలులో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది.ఎన్నికల్లో ఓడించలేక ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube