కేజ్రీవాల్ మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు రిజర్వ్..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మెడికల్ చెకప్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లో విచారణ జరిగింది.

ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జైలులో కేజ్రీవాల్ డైట్ చార్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే చక్కెర లెవల్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కేజ్రీవాల్ తీసుకుంటున్నారని ఈడీ( ED ) సంచలన ఆరోపణలు చేసింది.

మరోవైపు జైలులో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది.

ఎన్నికల్లో ఓడించలేక ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

మీ వెయిట్ లాస్ జర్నీలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను యాడ్ చేసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గొచ్చు.. తెలుసా?