Da Vinci Robot : రోగి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సర్జికల్ రోబో.. ఎక్కడంటే..

ఇటీవల కాలంలో రోబోలు మనుషుల ప్రాణాలను తీసేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.వీటిలో సాంకేతిక లోపాల కారణంగా అవి మనుషుల ప్రాణాలను చిదిమేస్తున్నాయి.

 Robot Surgery Death In Florida Details-TeluguStop.com

సర్జరీలలో వాడే రోబోలు కూడా మాల్ ఫంక్షన్ అవుతున్నాయి.తాజాగా యూఎస్‌( USA )లో ఓ మహిళకు పెద్దప్రేగు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేస్తున్న ఓ రోబో పొరపాటు చేసింది.

ఆమెను అది బాగా గాయపరిచింది దాంతో ఆ మహిళ మరణించింది.ఈ ఘటన భర్తకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఈ బాధ నుంచి తేరుకున్నాక ఫ్లోరిడా( Florida )లో రోబోను తయారు చేసిన కంపెనీపై ఆమె భర్త దావా వేశారు.రోబో వ్యక్తుల అవయవాలను తీవ్రంగా గాయపరచగలదని కంపెనీకి తెలుసునని, అయినా ఆ నిజాన్ని ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు.

కంపెనీ సర్జన్లకు బాగా శిక్షణ ఇవ్వలేదని లేదా ఆసుపత్రులకు రోబోటిక్ సర్జరీలో తగినంత అనుభవం ఉందో లేదో తనిఖీ చేయలేదని ఆయన ఆరోపించారు.

Telugu Da Vinci Robot, Florida, Lawsuit, Medical Safety, Nri, Robot Surgery, San

ఆ మహిళను పొట్టన పెట్టుకున్న రోబో పేరు డా విన్సీ( Da Vinci robot ) దానిని తయారుచేసిన కంపెనీ పేరు ఇంట్యూటివ్ సర్జికల్.చనిపోయిన మహిళ పేరు సాండ్రా సుల్ట్జర్( Sandra Sultzer )ఆమెకు 2021, సెప్టెంబర్‌లో శస్త్రచికిత్స జరిగింది.శస్త్రచికిత్స తర్వాత, నొప్పి, జ్వరం వచ్చింది.

రోబో చేసిన నష్టాన్ని పరిష్కరించడానికి ఆమెకు మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమయ్యాయి.కానీ పరిస్థితి విషమించడంతో 2022, ఫిబ్రవరిలో మరణించింది.

రోబో వల్ల కలిగే అన్ని గాయాలను ఇంట్యూటివ్ సర్జికల్ కంపెనీ ప్రభుత్వానికి నివేదించలేదని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

Telugu Da Vinci Robot, Florida, Lawsuit, Medical Safety, Nri, Robot Surgery, San

హార్వే సుల్ట్జర్ న్యాయవాది జాక్ స్కరోలా కేసు గురించి మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఇష్టపడలేదు.అయితే రోబోకు చాలా కాలంగా భద్రతా సమస్యలు ఉన్నాయని తెలిపారు.2009, జులై నుంచి 2011, డిసెంబర్ వరకు కంపెనీకి రోబో గురించి చాలా ఫిర్యాదులు అందాయని వ్యాజ్యం పేర్కొంది.రోబో మెటల్ భాగాన్ని కప్పి ఉంచిన రబ్బరు భాగంలో పగుళ్లు లేదా కోతలు ఉన్నాయని ఫిర్యాదులు పేర్కొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube