సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు రేణు దేశాయ్( Renu Desai ) ఒక మంచి మోడల్ మరియు ఫాషన్ డిజైనర్.మోడలింగ్ రంగం లో మంచి ప్రాచుర్యం పొందిన తర్వాత ఆమె డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannath ) దృష్టిలో పడింది.
అలా ‘బద్రి’ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని నటనకి దూరం అయ్యింది.బద్రి తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి మళ్ళీ జానీ చిత్రం లో నటించింది.
ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇన్నేళ్లకు వెండితెర మీద ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో పెళ్లి అయినా తర్వాత నటన కి దూరంగా ఉండాలనే నిర్ణయం రేణు దేశాయ్ దే.కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు తెర వెనుక పనులు చూసుకునేది రేణు దేశాయ్.
జానీ నుండి కొమరం పులి సినిమా( Komaram Puli movie ) వరకు పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసింది ఈమెనే.ముఖ్యంగా ఆమె డిజైన్ చేసిన ‘గుడుంబా శంకర్’ చిత్రం లో డబుల్ ప్యాంట్, అలాగే ‘బాలు’ చిత్రం లోని ప్యాంట్ అప్పట్లో ఎంత సెన్సేషన్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.యూత్ మొత్తం ఈ కాస్ట్యూమ్స్ ని ఒక రేంజ్ లో ఫాలో అయ్యేవారు.
అంత గొప్ప టాలెంట్ ని రేణు దేశాయ్ కేవలం కోసం మాత్రమే ఉపయోగించింది.తన సినిమాకే కాదు, మిగిలిన సినిమాలకు కూడా పని చేసుకోమని పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి చెప్పాడట.
కానీ ఆమె మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే పని చేసాడు.బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరొయిన్ గా కొనసాగిన ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) రేణు దేశాయ్ ని తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చెయ్యమని చాలా రిక్వెస్ట్ చేసిందట.
కానీ రేణు దేశాయ్ మాత్రం ఆమె రిక్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించిందట.తాను తన భర్త కోసం మాత్రమే పని చేస్తున్నాను అని, అక్కడికే సమయం మొత్తం సరిపోతుందని, మీకు కావాలంటే ప్రత్యేకంగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ చెయ్యడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ పూర్తి స్థాయిలో వ్యక్తిగత కాస్ట్యూమ్స్ డిజైన్ చెయ్యాలంటే నా వల్ల కాదని ఐశ్వర్య రాయ్ తో చెప్పిందట.కేవలం కాస్ట్యూమ్ డిజైన్స్ లో మాత్రమే కాదు, రేణు దేశాయ్ కి దర్శకత్వం లోను, అలాగే నిర్మాణ రంగం లోను మంచి పట్టు ఉంది.