కొత్తపిల్లతో మాస్ రాజా రొమాన్స్

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకుని తన సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఈ డైరెక్టర్ చూస్తున్నాడు.

 Raviteja To Romance Malavika Mohanan-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత కూడా తన నెక్ట్స్ మూవీలను లైన్‌లో పెట్టాడు రవితేజ.

ఇప్పటికే దర్శకుడు త్రినాథ రావుతో ఓ సినిమాను కమిట్ అయిన రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా మరో దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ మాళవిక మోహనన్ నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ బ్యూటీ ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాతో లాంఛ్ కావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అటకెక్కేసింది.

Telugu Krack, Raviteja, Trinadha Rao-Movie

దీంతో ఇప్పుడు రవితేజ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో ఎంట్రీ ఇస్తే తన కెరీర్‌కు బాగా కలిసొస్తుందని ఆమె ఆలోచిస్తుంది.కాగా ఈ సినిమాను ఇంకా రవితేజ కమిట్ కాకపోవడంతో ఇది ఎప్పుడు మొదలవుతుందా అనే ప్రశ్న అందరిలో నెలకొంది.ఇక త్రినాథరావుతో రవితేజ సినిమా అతిత్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అటు క్రాక్ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube