సగం సీట్లతోనూ తుక్కురేపిన రవితేజ- Raviteja Krack Movie Crossed 25 Cr Mark

Raviteja Krack Movie Crossed 25 Cr Mark, Raviteja, Krack, Collection, Tollywood News - Telugu Collection, Krack, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.

 Raviteja Krack Movie Crossed 25 Cr Mark-TeluguStop.com

అయితే కరోనా కారణంగా సగం అక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడుస్తుండటంతో ఈ సినిమా ఫలితంపై అటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్ద ఎత్తున ఆసక్తిని చూపారు.సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.

 Raviteja Krack Movie Crossed 25 Cr Mark-సగం సీట్లతోనూ తుక్కురేపిన రవితేజ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.దీంతో ఈ సినిమా ఇప్పటికే రూ.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.కరోనా కారణంగా సగం అక్యుపెన్సీలో కూడా ఇలాంటి కలెక్షన్లు రాబడుతుండటం, క్రాక్‌కు సొంతం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

దీంతో ఈ సినిమా ఎంతమేర హిట్ అయ్యిందో మనం అర్ధం చేసుకోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనా లాక్‌డౌన్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో స్టా్ర్ హీరోల సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అనే సందేహాలకు క్రాక్ చిత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చిందని చెప్పాలి.

ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఇకపై పెద్ద సినిమాలకు మంచి రోజులు రాబోతున్నాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక వరుసబెట్టి స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

కాగా క్రాక్ చిత్రంలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, తమిళ నటుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటించారు.

#Raviteja #Krack #Collection

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు