మెగాస్టార్ సినిమా నుంచి రవితేజ ఔట్.. భారీ రెమ్యునరేషనే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన నటన గురించి తెలియని వారు ఎవరూ లేరు.ఈయనకు ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో కూడా అభిమానులు ఉన్నారు.

 Ravi Teja Out Of Megastar Movie Is It Because Of Huge Remuneration, Ravi Teja, C-TeluguStop.com

ఈయన సినిమాలు అంటే పడిచచ్చే అభిమానులు ఎలా ఉంటారో.ఈయన సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా నటీనటులలో అలా ఉంటుంది.

అలా ఆయన సినిమాలో అదృష్టవశాత్తు కొందరికి అవకాశాలు అందుతూ ఉంటాయి.ఇక రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మెగాస్టార్ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.

వరుస అవకాశాలతో తన ఖాతాను నింపుకుంటున్నాడు.ఇక ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమాలో కూడా నటించగా ఇందులో కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా ఎందుకో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మరికొంత మంది దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా.అందులో మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక మరో విషయం ఏంటంటే గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్, బోళా శంకర్ లో కీర్తి సురేష్ లు కూడా అవకాశం అందుకున్నారు.

ఇక వీటితో పాటు చిరంజీవి బాబీ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాకు ఇటీవలే ‘వాల్తేరు వీరన్న’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Bola Shankar, Chiranjeevi, Keerti Suresh, Ravi Teja, Salman Khan, Telugu,

అంతేకాకుండా ఇందులో కూడా మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో మెగా అభిమానులకు, రవితేజ అభిమానులకు మరింత ఉత్సాహం పెరిగింది.ఇద్దరు మాస్ హీరోల కాంబినేషన్ లో మరో సారి సినిమా వస్తుంది అనటంతో ఈ సినిమా గురించి తెగ ఎదురుచూస్తున్నారు.

ఇక ఇందులో రవితేజ పాత్ర మెగాస్టార్ తమ్ముడిగా కనిపించనున్నట్లు కూడా తెలిసింది.కానీ తాజాగా ఒక వార్త నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.అదేంటంటే ఇందులో నుంచి రవితేజను తీసేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.ఎందుకంటే ప్రస్తుతం రవితేజకు పారితోషికం విషయంలో బాగా డిమాండ్ పెరగటంతో దీంతో చిరంజీవి సినిమాలో ఆ పాత్ర చేయడానికి దాదాపు 16 కోట్ల పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.

Telugu Bola Shankar, Chiranjeevi, Keerti Suresh, Ravi Teja, Salman Khan, Telugu,

దీంతో నిర్మాతలు ఆయన డిమాండ్ కు షాక్ అయినట్లు తెలియటంతో.దానికి నిరాకరించి ఆయనను చిరంజీవి సినిమా నుంచి ఔట్ చేశారని తెలుస్తోంది.ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం గురించి నెట్టింట్లో బాగా చర్చలు జరుగుతున్నాయి.మరి ఈ విషయం గురించి డైరెక్టర్ బాబీ స్పందిస్తాడో లేక రవితేజ స్పందిస్తాడో ఎదురుచూడక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube