''రత్నం'' ఫస్ట్ లుక్ ఆగయా.. మాస్ అవతార్ లో విశాల్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్( Vishal) ఒకరు.కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్.

 Rathnam Vishal 34 Title First Look Revealed, Rathnam, Vishal 34, Rathnam First L-TeluguStop.com

ఈయన తెలుగువాడైన కూడా కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.విశాల్ కు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే ఈయన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధిస్తుంటాయి.మంచి టాక్ వస్తే ఇక్కడ కూడా ఈయన సినిమాలకు బాగానే కలెక్షన్స్ వస్తాయి.

అయితే వరస హిట్స్ తో కేరీర్ లో జెట్ స్పీడ్ గా దూసుకు పోయే విశాల్ కు ఈ మధ్య సరైన హిట్ పడడం లేదు.

ఇదిలా ఉండగా ఇటీవలే విశాల్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు.విశాల్ కెరీర్ కు రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ హరితో మూడవ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.షూట్ ఇప్పటికే స్టార్ట్ చేయగా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ఫుల్ గా ఉంది.”రత్నం” ( Rathnam ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.ఈ పోస్టర్ లో విశాల్ పవర్ ఫుల్ గా కనిపిస్తుండగా చేతిలో నరికేసిన తలతో కనిపిస్తున్నాడు.మరి పోస్టర్ తోనే వైలెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.

ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) సంగీతం అందిస్తుండగా 2024 సమ్మర్ రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసారు.కాగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ ను స్టోన్ బెంచర్స్ మరియు జీ స్టూడియోస్ సౌత్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube