చాలామంది కి తెలియని రాకేష్ మాస్టర్ రెండవ భార్య లక్ష్మి జీవితం..! 

రాకేష్ మాస్టర్( Rakesh master ) కన్నుమూసి రెండు రోజులు గడుస్తుంది ఆయన చాలా ఇంటర్వ్యూలలో తన కుటుంబ గురించి చెప్తూ కన్నీళ్ల పర్యంతమైన విషయం కూడా మన అందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యతో కొన్ని కారణాల వల్ల విడిపోయాడు.ఆ తర్వాత రెండో భార్య అయిన లక్ష్మితో( Lakshmi ) కొన్నాళ్లు బాగానే కాపురం చేశాడు.

 Rakesh Master Second Wife Lakshmi Details, Rakesh Master, Rakesh Master Second W-TeluguStop.com

వీరిద్దరికి కూతురు రిషిక( Rishika ), కొడుకు చరణ్( Charan ) కూడా పుట్టారు.ఆ తర్వాత జరిగిన సంఘటనలు మొత్తం మీడియాలో పలుమార్లు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ సొంతంగా చెప్పుకున్నాడు.

అయితే అసలు విషయం ఏమిటి అంటే రాకేష్ మాస్టర్ ని ఆయన రెండవ భార్య ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్న సంగతి మనకు విధితమే అయితే భర్తను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పి ఆ భార్య పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తుంది అనే విషయమే ఎవ్వరికీ తెలియదు.

రాకేష్ మాస్టర్ తాను సినిమాల్లో సంపాదించిన డబ్బుతో బోరబండలో ఒక ఇంటిని నిర్మించాడు.ఆ ఇల్లు తప్ప ఆయన భార్య పిల్లలకు ఎలాంటి ఆధారం లేదు.ఆ ఇంట్లోనే లక్ష్మీ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది.

రాకేష్ మాస్టర్ బయట అద్దె ఇళ్లల్లో ఉంటూ ఏదో షూటింగ్స్ చేసుకుంటూ, ఇంటర్వ్యూలు చేసుకుంటూ జీవితాన్ని వెల్లబుచ్చారు.బోరబండలో తన సొంత ఇంట్లో ఉంటూ ప్రైవేట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ గా ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చదివించుకుంటుంది లక్ష్మి.

ఆమె ఏ రోజు కూడా బయటకు వచ్చి తన భర్త గురించి కానీ ఆమె జీవితంలో జరుగుతున్న విషయాలను కానీ ఎక్కడా చెప్పింది లేదు.

నేడు రాకేష్ మాస్టర్ డబ్బులతో జల్సాలు చేసిన ఏ ఒక్కరు కూడా ఆయనతో లేరు.చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయనను వద్దు అనుకున్న భార్యా పిల్లలు వచ్చి శవాన్ని ఇంటికి తీసుకెళ్లి దహాన సంస్కారాలు చేశారు.రాకేష్ మాస్టర్ కూతురు రిషిక కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కుటుంబ సభ్యులు అంతా కూడా తమ ఇంటికి ఉన్న పెద్ద దిక్కున కోల్పోయామని బాధలు ఏడుస్తూ ఉండడం మనం గమనించాం.

ఏది ఏమైనా కూడా భర్తకు భార్య, భార్యకు భర్త తప్ప మరొకరు ఉండరు అని, కుటుంబమే ఎప్పటికి నిలిచి ఉంటుంది అని రాకేష్ మాస్టర్ ఉదాంతం మరోసారి నిరూపించింది.

Unknown Facts about Rakesh master Second Wife Lakshmi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube