హీరో రాజ్ తరుణ్.( Raj Tarun ).
ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషనల్ గా మారిపోయాడు.తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య( Lavanya ) పెట్టిన కేస్ ద్వారా మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ప్రస్తుతం నాన్ బెయిలబుల్ వారెంట్( Non-bailable warrant ) అతనిపై జారీ చేయబడింది.
ఇంతతంగానికి కారణం లావణ్య తో చాలా ఏళ్ల పాటు అతని చేసిన సహజీవనమే అని చెప్పొచ్చు.అందులో తప్పు ఇద్దరి వైపు ఉన్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ వైపే అందరి ఫోకస్ కనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా తన కెరీర్లో చాలా ఇబ్బందులు ఉన్న కారణంగా ఈ చీటింగ్ వ్యవహారం అతనిని నిండా ముంచే రకంగా కనిపిస్తుంది.అయితే ఇలా కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం రాజ్ తరుణ్ కి కొత్తమీ కాదు.
చాలా చిన్న వయసులో మంచి హిట్ దొరకడంతో అది అతడికి మైనస్ గా మారింది.ఇలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ ( Background support )లేకపోవడంతో ఎలాంటి కథలు ఎంచుకోవాలి ఎవరితో సంబంధాలు మెయింటైన్ చేయాలి అనే విషయంలో రాజ్ తరుణ్ వెనకబడ్డాడు.పైగా మద్యం అలవాటు కూడా ఉండటంతో మానసికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇంకా గతంలో రాజ్ తరుణ్ తన ఓల్వో కారు ప్రమాదం చేసి అక్కడి నుంచి పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అది పెద్ద సంచలనం అయ్యింది.
మొదట అది తను కాదు అని భూకాయించిన సిసి కెమెరాలు రికార్డు అవ్వడంతో బయటకు రాక తప్పలేదు కేవలం భయపడి పారిపోయాను అంటూ సర్దుకొచ్చాడు.
ఇక మితిమీరిన మద్యం సేవిస్తాడు అనే కంప్లైంట్ కూడా రాజ్ తరుణ్ పై ఉంది డ్రెస్ వ్యవహారం కూడా గుట్టు రట్టు తేల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉంది.రాజ్ తరుణ్ కి హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయ్ అంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి లవర్ మూవీ హీరోయిన్ రిధి, అరియాన గ్లోరీ( Heroine Ridhi, Ariana Glory ), మరొక హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ( Malvi Malhotra )తో అతనికి గల సంబంధాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు బగ్గు మంటున్నాయి.మరి ఇన్ని అవలక్షణాలతో ఇకపై కెరియర్ ఎలా కంటిన్యూ చేస్తాడు అనే విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారగా అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది.
ఈ హైప్ అంతా కూడా తన బిగ్ బాస్ ఎంట్రీ కోసం వాడుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చేవారు కూడా లేకపోలేదు.