నక్కీలీసు గొలుసు పాటకి డాన్స్ చేసినందుకు దుర్గారావు దంపతులను రఘుకుంచే అలా అన్నారా?

రఘు కుంచె సంగీత సారథ్యంలో పలాస చిత్రం నుంచి విడుదలైన నాది నక్కీలీసు గొలుసు పాట ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.అయితే ఈ పాట సినిమా నుంచి విడుదలైనప్పటి కన్నా టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు దంపతులు ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ పాట విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

 Raghukunche Did That To Durgarao Couple For Doing Dancing To The Nakkilisu Golus-TeluguStop.com

టిక్ టాక్ వీడియోలో భాగంగా దుర్గారావు దంపతులు చేసిన స్టెప్పుల పై పలువురు ప్రశంసలు కూడా కురిపించారు.ఈ దంపతుల డాన్స్ కారణంగా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Telugu Durgarao, Prize Rs Lac, Raghukunche, Tollywood-Movie

ఇప్పటికీ ఈ పాట వింటే టక్కున అందరికీ దుర్గా రావు దంపతులు చేసిన డాన్స్ గుర్తుకు వస్తుంది తప్ప పలాస సినిమాలోని డాన్స్ గుర్తు రాదు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గారావు దంపతులు ఈ పాట గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.ఈ పాటకు డాన్స్ చేసినందుకు రఘు కుంచే గారు ఏకంగా తమని వారి ఇంటికి ఆహ్వానించారని తెలిపారు.ఇలా ఇంటికి ఆహ్వానించి ఆయన మాతో సుమారుగా గంటకు పైగా మాట్లాడుతూ పాటకు చాలా అద్భుతంగా డాన్స్ చేసావని ప్రశంసలు కురిపించారు.

Telugu Durgarao, Prize Rs Lac, Raghukunche, Tollywood-Movie

ఇలా రఘు కుంచే గారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించడమే కాకుండా మాకు లక్ష రూపాయల బహుమానం కూడా ఇచ్చారని ఈ సందర్భంగా దుర్గా రావు వెల్లడించారు.మరి ఆ లక్ష రూపాయలతో ఏం చేశారని ప్రశ్నించగా ఇప్పటివరకు ఆ డబ్బును ఆయన గుర్తుగా అలాగే పెట్టామని ఎప్పటికైనా ఆ డబ్బుతో ఒక గొలుసు చేయించి తన భార్యకు ఇస్తానని ఈ సందర్భంగా దుర్గారావు నక్కీలీసు గొలుసు పాట గురించి తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ఈయన ఏకంగా ఆరు సినిమాలో నటిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube