నక్కీలీసు గొలుసు పాటకి డాన్స్ చేసినందుకు దుర్గారావు దంపతులను రఘుకుంచే అలా అన్నారా?
TeluguStop.com
రఘు కుంచె సంగీత సారథ్యంలో పలాస చిత్రం నుంచి విడుదలైన నాది నక్కీలీసు గొలుసు పాట ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.
అయితే ఈ పాట సినిమా నుంచి విడుదలైనప్పటి కన్నా టిక్ టాక్ ఫేమ్ దుర్గారావు దంపతులు ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ పాట విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
టిక్ టాక్ వీడియోలో భాగంగా దుర్గారావు దంపతులు చేసిన స్టెప్పుల పై పలువురు ప్రశంసలు కూడా కురిపించారు.
ఈ దంపతుల డాన్స్ కారణంగా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. """/"/
ఇప్పటికీ ఈ పాట వింటే టక్కున అందరికీ దుర్గా రావు దంపతులు చేసిన డాన్స్ గుర్తుకు వస్తుంది తప్ప పలాస సినిమాలోని డాన్స్ గుర్తు రాదు.
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గారావు దంపతులు ఈ పాట గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.
ఈ పాటకు డాన్స్ చేసినందుకు రఘు కుంచే గారు ఏకంగా తమని వారి ఇంటికి ఆహ్వానించారని తెలిపారు.
ఇలా ఇంటికి ఆహ్వానించి ఆయన మాతో సుమారుగా గంటకు పైగా మాట్లాడుతూ పాటకు చాలా అద్భుతంగా డాన్స్ చేసావని ప్రశంసలు కురిపించారు.
"""/"/
ఇలా రఘు కుంచే గారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించడమే కాకుండా మాకు లక్ష రూపాయల బహుమానం కూడా ఇచ్చారని ఈ సందర్భంగా దుర్గా రావు వెల్లడించారు.
మరి ఆ లక్ష రూపాయలతో ఏం చేశారని ప్రశ్నించగా ఇప్పటివరకు ఆ డబ్బును ఆయన గుర్తుగా అలాగే పెట్టామని ఎప్పటికైనా ఆ డబ్బుతో ఒక గొలుసు చేయించి తన భార్యకు ఇస్తానని ఈ సందర్భంగా దుర్గారావు నక్కీలీసు గొలుసు పాట గురించి తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం ఈయన ఏకంగా ఆరు సినిమాలో నటిస్తున్నట్లు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ఆ ట్రోల్స్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లాను.. మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు వైరల్!