ఛత్రపతి.( Chatrapathi ) ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.
ఎందుకంటే ఈ సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి ( Rajamouli ) డైరెక్ట్ చేయగా.ఇందులో హీరోగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) నటించాడు.
మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా రాబట్టిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్న విషయం విదితమే.
హిందీ రీమేక్ లో కూడా మన తెలుగు హీరోనే నటిస్తుండగా తెలుగు డైరెక్టర్ నే డైరెక్ట్ చేస్తున్నాడు.నార్త్ బెల్ట్ లోనే సెన్సేషనల్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Srinivas ) ఒకరు.
ఈయనకు అక్కడ మంచి డిమాండ్ ఉంది.
తన సినిమాలతో హిందీలో వరల్డ్ రికార్డును నమోదు చేసిన బెల్లంకొండ ఇప్పుడు తన హిందీ డెబ్యూ చేస్తున్నాడు.వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఛత్రపతి రీమేక్ తో హిందీలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకునేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇటీవలే ఛత్రపతి టీజర్ ( Chatrapathi Teaser ) ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
వినాయక్, బెల్లంకొండ ఇద్దరు కూడా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.మరి ఇది హిందీ సినిమా కావడంతో ప్రమోషన్స్ కాస్తంత ఎక్కువగానే చెయ్యాల్సి వస్తుంది.అందుకే బెల్లంకొండ ఇప్పుడు ప్రమోషన్స్ కు సిద్ధం అయ్యాడు.
తాజాగా తన సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటోలను షేర్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపాడు.చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు అక్కడ క్రియేట్ చేస్తుంది.
ఇక ఈ సినిమాను పెన్ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా నుష్రత్ భూరూచా హీరోయిన్ గా నటించింది.మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.