పాక్‌లో అమ్మాయిల మృతదేహాలపై రేప్స్‌.. సమాధులకు లాక్ వేసుకోవాల్సిన పరిస్థితి!!

సమాజంలో మహిళల పట్ల దాడులు పెరిగిపోతున్నాయి.ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కామాంధులు అత్యాచారాలు చేస్తున్నారు.

 Parents Are Locking Daughters Graves In Pakistan Details, Pakistan, Necrophilia,-TeluguStop.com

పసిపిల్లల నుంచి పండు ముసలి వయస్సు ఉన్న ఆడవారి వరకు అందరినీ కామాంధులు కాటేస్తున్నారు.అయితే పాకిస్థాన్‌లో ( Pakistan ) కామాంధులు మరింత కళ్లు మూసుకుపోయారు.

పూడ్చిపెట్టిన సమాధులలో నుంచి ఆడ శవాలను( Womens Graves ) బయటికి తీసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.క్రూర మృగాలు కూడా ఇలాంటి నీచపు పనులు చేయడానికి దిగజారవు కానీ మానవ రూపంలో ఉన్న పాక్ ప్రజలు ఇలాంటి లైంగిక అఘాయిత్యాలకు పాల్పడుతూ యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేస్తున్నారు.

ఈ కామాంధుల భారీ నుంచి తమ ఆడవారి మృతదేహాలను అపవిత్రం కాకుండా కాపాడుకునేందుకు బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.మరికొందరైతే సమాధులకు లాకులు ( Locking Graves ) వేస్తున్నారు.ఇంకొందరు ఇనుప రాడ్లతో గ్రిల్స్ లాగా ఏర్పాటు చేసి వాటిలో తమ కుమార్తెల మృతదేహాలను సంరక్షించుకుంటున్నారు.ఎలాగూ కూతుర్లు పోయారు.కనీసం వారి గౌరవాన్ని అయినా కాపాడాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు.

ఇకపోతే గతంలో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌కు చెందిన కాటి కాపరి ముహమ్మద్ రిజ్వాన్ 48 మహిళా మృతదేహాలను సమాధుల నుంచి తవ్వి రేప్ చేశాడు.ఈ విషయాన్ని అతడు ఒప్పుకోవడంతో కథలు కథలుగా వార్తలు వెళ్లువెత్తాయి.చనిపోయిన వారిపై అత్యాచారం చేయడాన్ని నెక్రోఫిలియా ( Necrophilia ) అంటారు.

అయితే ఈ తరహా కేసులు పాకిస్థాన్‌లో చాలానే నమోదయ్యాయి.మొదట 2011లో ఈ దాయాది దేశంలో తొలి నెక్రోఫిలియా కేసు నమోదైంది.

అప్పటినుంచి దీనికి సంబంధించిన కేసులు బాగా పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube