జీవిత నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: నిర్మాతలు ఫైర్‌

గరుడ వేగ సినిమా వివాదం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో జీవిత రాజశేఖర్‌ ఈ అంశంపై మాట్లాడుతూ గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.

 Producers Hema Koteswara Raju Fires On Jeevita Rajasekhar Details, Producers Hem-TeluguStop.com

అనవసరంగా తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించింది.తప్పొప్పులు తెలుసుకోకుండా అసత్యాన్ని ప్రచారం చేయవద్దని సూచించింది.

తాజాగా ఆమె వ్యాఖ్యలపై గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.

జీవిత రాజశేఖర్‌ ఒక మహానటి.ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు.

ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు.మొదట్లో అసలు మేము ఎవరో కూడా తెలీదన్నారు.

కానీ నిన్న మా గురించి లిమిట్స్‌ క్రాస్‌ చేసి మాట్లాడారు.మేము పరువుగల కుటుంబం నుంచి వచ్చాము.

జీవిత రాజశేఖర్‌ నోరు అదుపులో పెట్టుకో.సెలబ్రిటీలకు ఒక లైఫ్‌, సామాన్యులకు ఒక లైఫ్‌ ఉంటుందా? సెలబ్రిటీ పేరుతో మోసాలు చేస్తోంది.జీవిత రాజశేఖర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది.మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము.కోర్టులో మేము విజయం సాధిస్తాం’ అని కోటేశ్వరరాజు, హేమ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube