స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తన కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో తనపై సింపతీ క్రియేట్ అయ్యే విధంగా సమంత వ్యవహరించడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత చిట్టిబాబు( Producer Chittibabu ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమంతకు మళ్లీ స్టార్ డమ్ రాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.నాగచైతన్య( Naga Chaitanya )తో విడాకుల తర్వాత సమంత పుష్ప ది రైజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిందని ఆయన అన్నారు.పుష్ప ఐటమ్ సాంగ్ సమంత బతుకుదెరువు కోసం చేసిందని ఆయన కామెంట్లు చేశారు.
సమంత హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయిన తర్వాత తన చేతికి వచ్చిన ప్రాజెక్ట్ లను చేసుకుంటూ ముందుకెళ్లిందని చిట్టిబాబు తెలిపారు.
అయితే సమంతకు హీరోయిన్ గా కెరీర్ ముగిసినట్టేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం సమంత గతాన్ని వాడుకుని ముందుకెళుతున్నారని అయన అభిప్రాయం వ్యక్తం చేశారు.సమంతకు మళ్లీ స్టార్ డమ్ రాదని యశోద మూవీ ( Yashoda Movie )టైమ్ లో ఏడ్చి సమంత ఆ మూవీతో సక్సెస్ సొంతం చేసుకోవాలని భావించిందని చిట్టిబాబు తెలిపారు.
ప్రస్తుతం శాకుంతలం( Sakunthalam ) గురించి మాట్లాడుతూ సమంత చచ్చిపోయేలోపు ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని అనుకున్నా అని చెప్పిందని ఆయన చెప్పుకొచ్చారు.
సమంత ఎందుకు డ్రామాలు చేస్తోందని ప్రతిసారి సెంటిమెంట్ వర్కౌట్ కాదని చిట్టిబాబు కామెంట్లు చేశారు.అయ్యో పాపం, ఆఖరి కోరిక అనేలా సమంత మాట్లాడుతోందని చిట్టిబాబు పేర్కొన్నారు.శాకుంతం మూవీపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ఆయన అన్నారు.
సమంతవి పిచ్చివేషాలని ప్రతిసారి సామ్ సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోందని చిట్టిబాబు తెలిపారు.మరోవైపు శాకుంతలం సినిమాలు రివ్యూలు నెగిటివ్ గా వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.