ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో( World Cup Final Match ) టాస్ వేయడానికి ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో( Narendra Modi Stadium ) బీసీసీఐ ప్రత్యేక సెలబ్రేషన్స్ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎయిర్ షో, మ్యాచ్ మధ్యలో లేజర్ షో లాంటి కార్యక్రమాలతో పాటు బాణాసంచా మిరుమిట్లతో సందడితో స్టేడియంలో హంగామా చేయనుంది.
టాస్ వేశాక నాణెం నేలను తాకిన వెంటనే నింగిలో ఎయిర్ షో( Air Show ) సెల్యూట్ చేస్తుంది.ఏకంగా తొమ్మిది ప్రత్యేక ఫ్లైట్లతో దాదాపుగా పది నిమిషాల పాటు ఈ ఎయిర్ షో ప్రదర్శన ఉండనుంది.
భారత వైమానిక దళానికి చెందిన ది సూర్య ఏరోబాటిక్ టీం ఆకాశంలో విన్యాసాలతో ప్రత్యేక సందడితో ప్రేక్షకులను అలరించనుంది.
ముఖ్యంగా ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండి పోయేలా.1975 నుంచి 2019 వరకు మధ్య జరిగిన 12 ప్రపంచ కప్ల విజయ సారథులకు బ్లేజర్లు, జ్ఞాపికలతో ప్రత్యేకంగా బీసీసీఐ( BCCI ) సత్కరించే కార్యక్రమం చేయనుంది.భారతీయ సంప్రదాయ నాట్యం, డ్యాన్సులతో కళాకారుల బృందం స్టేడియాన్ని హోరెత్తించనుంది.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం ఆధ్వర్యంలో దాదాపుగా 500 మంది కళాకారులతో గానా బజానా కార్యక్రమం జరగనుంది.
స్టేడియంలో భారతదేశంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినిమా సెలబ్రిటీస్ ప్రత్యేక ఆకర్షణ కానుండగా.ఆకాశంలో బాణాసంచాలతో, తారాజువ్వలతో తెగ హంగామా జరుగనుంది.అహ్మదాబాద్ లోని( Ahmedabad ) నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఎలాంటి భద్రత లోపాలు జరగకుండా గా 6000 మంది పోలీసులు స్టేడియాన్ని పహారా కాస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వం స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.మొత్తానికి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంది పోయేలా బీసీసీఐ చాలా ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేసింది.
ఈ టోర్నీలో భారత్ గెలిచి టైటిల్ కైవసం చేసుకోవాలని క్రికెట్ అభిమానులతో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు.