తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోగా ప్రసారమవుతూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం ఒకటి ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్లు బీభత్సమైనటువంటి పర్ఫామెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో శోభ శెట్టి(Sobha Shetty) అలియాస్ మోనిత ఒకరు.
ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో మాత్రం కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ద్వారా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఈ సీరియల్ లో డాక్టర్ బాబును తన సొంతం చేసుకుని ఒక విలన్ పాత్రలో నటించారు.కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించినటువంటి ప్రేమి విశ్వనాథకు( Premi Viswanath ) నిత్యం టార్చర్ చూపిస్తూ మోనిత అనే విలన్ పాత్రలో ఈమె నటించిన సంగతి తెలిసిందే.
ఇలా ఈమె విల నిజానికి కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఈ సీరియల్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఎలాంటి సీరియల్ లో తిరిగి కనిపించలేదు.అయితే పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసే శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు.అయితే తాజాగా ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇక ఈమె హౌస్ లోకి వెళ్లేముందు నాగార్జున(Nagarjuna)వేదికపై ఈమెతో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి నువ్వు శోభ శెట్టిగా వెళ్తున్నావా లేక మోనితగా( Monitha ) వెళ్తున్నావా అంటూ ప్రశ్నించారు అయితే ఈమె మాత్రం శోభ శెట్టి గాని లోపలికి వెళ్తున్నానని చెప్పి మోనిత విశ్వరూపాన్ని చూపిస్తుందని చెప్పాలి.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఈమె సీరియల్ లో మాదిరి తన విలనిజం చూపించడంతో నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మోనిత బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన తరువాత విలన్ మాదిరిగా వ్యవహరించడంతో ఈమెకు గట్టి పోటీ ఇవ్వాలి అంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ కార్యక్రమంలోకి వంటలక్కను కూడా పంపించాల్సి ఉంటుందని అప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతుంది అంటూ నెటిజెన్స్ ఈమె వ్యవహార శైలి పై కామెంట్స్ చేస్తున్నారు.మరి నిజంగానే ఈ కార్యక్రమంలోకి వంటలక్క వస్తే షో రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయి అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.