క్లిక్ క్లిక్‌ : రాధే శ్యామ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ఇలా జరుగుతున్నాయి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమా గత నాలుగు ఏళ్లుగా ఊరిస్తూ ఉంది.ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు జాతీయ స్థాయి అంచనాల నడుమ రాబోతుంది.

 Prabhas Radheshyam Movie Pre Release Event Work Started With Pooja, Prabhas , P-TeluguStop.com

హిందీ తో పాటు ప్రతి ఒక్క ఇండియన్ లాంగ్వేజ్ జనాలు కూడా రాధే శ్యామ్‌ ను చూడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.

ఇప్పటి వరకు జరగనటువంటి ఒక భారీ నేషనల్‌ లెవల్‌ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.రికార్డులను బ్రేక్‌ చేసేంతటి జనం మరియు దేశ వ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు.

ఈనెల 23న రామోజీ ఫిల్మ్‌ సిటీ మెయిన్ గేట్‌ వద్ద జరుగబోతున్న ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

భూమి పూజ నిర్వహించి.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.శ్రేయాస్ మీడియా వారు ఈ భారీ వేడుకను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు శ్రేయాస్ మీడియా ఎన్నో భారీ ఈవెంట్స్ ని నిర్వహించడం జరిగింది.ఖచ్చితంగా ఈ ఈవెంట్‌ ను కూడా అత్యంత భారీ ఎత్తున నిర్వహించి సక్సెస్ ను దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

చాలా నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి అప్పగించడం జరిగింది.ఆయన ఏమాత్రం లోటు లేకుండా అభిమానుల కోసం.వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు.ఈ ఈవెంట్ ను శ్రేయాస్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.రాధే శ్యామ్‌ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube