ఎక్కడైనా ఒక అవకాశాన్ని వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడుకునే వాళ్లను రాజకీయ నాయకులని అంటూ ఉంటారు.అలాగే అవకాశాన్ని సమాజ హితం కోసం వినియోగించిన వ్యక్తిని ప్రజా సేవకుడు అంటూరు.
ప్రస్తుతం ఏపీలో పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) వ్యవహారం కూడా అదేవిధంగా ఉందని చెప్పుకోవచ్చు.గత టీడీపీ ప్రభుత్వ( TDP Govt) హయాంలో పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితికి ఎంతో వైవిధ్యం ఉంది.
కేంద్ర ప్రభుత్వం సైతం సీఎం జగన్( CM Jagan ) వాదనతో ఏకీభవించి అదనంగా నిధులు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు దివంగత నేత వైఎస్ఆర్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యంతో తుది రూపు దాల్చలేదు.గత ప్రభుత్వాలు అంచనా వ్యయాన్ని పెంచడమే కాకుండా దోపిడీకి పాల్పడుతూ ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించలేదు.పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో సుమారు 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
ఉభయ గోదావరి జిల్లాలో 10 లక్షలు, కృష్ణా జిల్లాలో మరో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడనుంది.పోలవరం నుంచి విశాఖ వరకు 182 కిలోమీటర్లు ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.172 కి.మీ పొడవున్న కుడి కాలువ ద్వారా విజయవాడ వరకు మరో 3.20 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు సరఫరా చేయవచ్చు.అంతేకాదు పోలవరం రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు ద్వారా సుమారు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
దాంతో పాటు మెట్ట ప్రాంతంలో 540 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వీలు ఉంది.
అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిన చంద్రబాబు దానికి తూట్లు పొడుస్తూ కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరే విధంగా పట్టిసీమ ఎత్తి పోతల పథకంపై ఆసక్తి కనబరిచారని తెలుస్తోంది.పోలవరాన్ని పూర్తి చేసే ఆలోచన లేని టీడీపీ ప్రభుత్వం అనాడు కేంద్రంతో కలిసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాడనే విమర్శలు చాలానే వచ్చాయి.పట్టిసీమ పేరుతో ప్రజా ధనం దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పోలవరానికి టీడీపీ శాపం నుంచి విముక్తి కలిగించారు.దీంతో పోలవరం పనులలో పురోగతి లభించింది.సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి రూ.12,911 కోట్లు సాధించారు.అంతేకాదు ప్రాజెక్ట్ నిర్మాణానికి మరో రూ.10,000 కోట్లు అడగగా జగన్ వినతిపై ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు.దీంతో అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు తీరనున్నాయి.