తూర్పుగోదావరి, రాజమండ్రి: రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు.డిఆర్సీ సమావేశంలో రైస్ ప్రొక్యూర్మెంట్ పై సంచలన కామెంట్స్ చేసిన పిల్లి బోస్.రబీ ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోంది.17 వేల మంది రైతులు ఆధార్ తో లింక్ కాలేదు.దీనిలో రైస్ మిల్లుల యజమానులు, అధికారుల జోక్యం ఉంది.
ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారు.
నా వద్ద ఖచ్చితమైన ఆధారాలు వున్నాయి.దీనిపై సిఐడి విచారణ కోరతాను.
ధాన్యం కొనుగోళ్లను సిఎం జగన్ ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారు.క్షేత్రస్థాయిలో రైతులకు అన్యాయం చేస్తున్నారు.