ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు గురువారం రాత్రి పట్టణములోని 25 వార్డులో ఆమె గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ని 25 వ వార్డు లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రజలందర్నీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ వివరిస్తూ వాటి తాలూకా కరపత్రాలను వారికి అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ప్రజల నుండి సలహాలను కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు.
గడప గడపకు కార్యక్రమం పట్టణంలో ఈరోజు మూడవరోజు జరుగుతుందన్నారు.ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్ల అందజేస్తున్న అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు