యాంకర్ రవి డబ్బులు తీసుకోని నాపై బూతు కామెంట్లు చేశాడు.. నటరాజ్ మాస్టర్

యాంకర్ రవి ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ నాన్ స్టాప్ షోనుంచి అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకు పలువురు కంటెస్టెంట్ లతో చేసిన ఇంటర్వ్యూ ఒక ఎత్తు అయితే నట్రాజ్ మాస్టర్ తో చేసిన ఇంటర్వ్యూ మరొక ఎత్తు అని చెప్పవచ్చు.

 Natraj Master Revealed Sensational Facts About Anchor Ravi Bb Buzz Interview Det-TeluguStop.com

ఎందుకంటే అది ఒక ఇంటర్వ్యూ మాదిరి కాకుండా గతంలో వీరిద్దరి హౌస్ లో గొడవ పడినట్లు గానే ఇంటర్వ్యూలో కూడా ఒకరిపై ఒకరు పంచులు సెటైర్లు వేసుకుంటూ గొడవపడి నట్టుగానే తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో నట్రాజ్ మాస్టర్ యాంకర్ రవి ని గుంటనక్క అంటూ దారుణంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

ఇక ఎప్పటి నుంచో మాస్టర్ కోసం ఎదురు చూస్తున్న యాంకర్ రవి కి మంచి అవకాశం దొరకడంతో ఇంటర్వ్యూలో ఆడేసుకున్నాడు.

నటరాజ్ మాస్టర్‌ కూడా తగ్గదేలే అన్న విధంగా రవి పై కౌంటర్లు వేసాడు.

అయితే రవి తనని కావాలనే టార్గెట్ చేస్తూ,గత సీజన్ లో జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరించాడు అంటూ నటరాజ్ మాస్టర్ ఆరోపించిన విషయం తెలిసిందే.నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ బిగ్ బాస్ బజ్‌లో యాంకర్ రవి తనను ప్రశ్నలు అడిగిన విధానం చూస్తే ఖచ్చితంగా టార్గెట్ చేసినట్టే అనిపించిందని, మొదటి నుంచి ఎలిమినేట్ అయిన వారిని ఎవరిని అలాంటి ప్రశ్నలు అడగలేదని తెలిపారు.

అంతే కాకుండా మా బ్రదర్ ఫోన్ చేసి మరీ అతన్ని అడిగాడట.నువ్ సీజన్ 5ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నావ్ ఎంత వరకూ కరెక్ట్ అని అడిగితే.

మరి నా ఇంట్లో వాళ్లు ఫీల్ కాలేదా? గుంటనక్క అన్నందుకు మా ఇంట్లో వాళ్లు ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు.దానికి ఏం చేయాలి అని అడిగాడు.

Telugu Anchor Ravi, Bigg Boss Buzz, Biggboss, Bigg Boss, Bindu Madhavi, Nataraj

దానిని బట్టి అతను యాంకర్ వృత్తికి ద్రోహం చేస్తున్నట్టే కదా.సీజన్ 5 అయిపోయింది.దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు.షో డైరెక్టర్లు వద్దని చెప్తున్నా.రవికి నచ్చినట్టు అడుగుతున్నాడు.పర్సనల్ ఎటాక్ చేశాడు అని చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్.

ప్రోమోలకు కామెంట్లు పెట్టేది కూడా పీఆర్ టీంలే.జన్యున్ సపోర్టర్స్ ఉండటం లేదు.

బెదిరిస్తున్నారు.వీటన్నింటిపై నేను రీసెర్చ్ చేశాను.

ఆ బండారం మొత్తం బయటకు వచ్చింది.చెన్నై నుంచి ఒక టీం ఉంది.

ఇక్కడ మరో టీం ఉంది.ఈ రెండు టీంలో బిందు మాధవి కోసం పనిచేస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు నటరాజ్ మాస్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube