పవన్ కు ఆ విషయం అర్ధం అయ్యిందా ? వారితో నేడు టెలికాన్ఫరెన్స్ ?

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, పట్టు పెంచుకునేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగా పెద్ద ఎత్తున టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ, వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 Pawan Kalyan Tele Conference Janasena Leaders, Bjp, Tdp, Ap Capital Issue, Ycp G-TeluguStop.com

అలాగే గత టీడీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ, టిడిపికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీ వైసీపీ కంటే ఎక్కువగా బిజెపి యాక్టివ్ గా ఉంటోంది.కానీ బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం రాజకీయంగా సైలెంట్ అయ్యిందనే వ్యాఖ్యలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

పవన్ ప్రస్తుత రాజకీయ వ్యవహారాలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియా ద్వారా మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు.ఈ పరిణామాలతో జనసేన కార్యకర్తల్లో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది.అయినా జనసైనికులు ప్రజల్లోకి వెళుతూ, పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతూ, పవన్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పాలైనా, 2024 ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా బిజెపి సహకారంతో జనసేన జెండా రెపరెపలాడించాలని చూస్తున్నారు.కానీ అందుకు తగ్గ ప్రయత్నాలు చేయకపోవడంతో, రాజకీయంగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు.కరోనా వైరస్ ప్రభావం ఏపీలో మొదలైనప్పటి నుంచి పవన్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.

పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయాడు.ఈ వ్యవహారంపై ఆయన విమర్శలకు గురవుతూ ఉండడంతో, రెండు రోజులుగా పవన్ మళ్లీ యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

Telugu Ap, Pawan Kalyan, Pawankalyan, Ycp-Telugu Political News

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాలను హైలెట్ చేస్తూ, విమర్శలు చేస్తున్నారు.అలాగే అమరావతి వ్యవహారంపైనా స్పందిస్తున్నారు.ఇక పూర్తిగా యాక్టివ్ గా ఉండకపోతే, 2024 ఎన్నికల నాటికి పుంజుకోవడం కష్టం అనే అభిప్రాయం అటు బిజెపి కూడా ఇస్తుండడంతో, ఇక నేరుగా రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారట.రాజధాని తరలింపు అంశంపై ఈరోజు జనసేన పార్టీ కీలక నాయకులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందించాలి అనే విషయంపై చర్చించబోతున్నారట.
ఎందుకంటే ఇప్పటికే బిజెపి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మూడు రాజధానులకు జై కొట్టడంతో, ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేది పవన్ కు అర్థం కావడం లేదు.గతంలో బీజేపీ సహకారంతో అమరావతి నుంచి రాజధాని తరలింపు అడ్డుకుంటామని పవన్ చెప్పడంతో, ఇప్పుడు ఈ విషయంలో ఏ విధంగా స్పందించాలి అనేది పవన్ కు అర్థం కావడం లేదు.

ఈ నేపథ్యంలోనే ఈ కీలక సమావేశంలో అన్ని విషయాలపైన చర్చ పెట్టబోతున్నారట.అలాగే రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలకు హైకోర్టు అవకాశం ఇవ్వడంతో, దీనిపై ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంపైనా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నేతల అభిప్రాయాలు తీసుకోవాలని పవన్ చూస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube