దసరాకే దిగుతున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే 90 శాతానికిపైగా షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.

 Pawan Kalyan Surender Reddy Movie Launch Date, Pawan Kalyan, Surender Reddy, Tol-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆయన నటించబోయే సినిమాలను ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అందులో వకీల్ సాబ్ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి.

దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ తన 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు పవన్ రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమా తరువాత పవన్ తన 30వ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలోనే దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.కానీ ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారా అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు.

కాగా ఈ కాంబోలో రాబోయే సినిమాను దసరా పర్వదినం నాడు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాను రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరి పవన్ కోసం సురేందర్ రెడ్డి ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడో, పవన్‌ను ఆయన ఎలా చూయిస్తాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా పట్టాలెక్కి, రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube