మెల్లగా రగంలోకి దిగుతున్న జూనియర్ పవర్‌ స్టార్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( pawan kalyan ) వారసుడు అకీరా నందన్‌( Akira nandan ) ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇప్పటి వరకు పవన్ నుండి కానీ, రేణు దేశాయ్ గురించి కానీ అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.

 Pawan Kalyan Son Akira Nandan Movie Entry , Pawan Kalyan ,akira Nandan , Tollywo-TeluguStop.com

అయితే ఇప్పటికే అకీరా నందన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు అన్నట్లుగా లైన్ క్లీయర్ చేసుకుంటూ రూటు వేసుకుంటున్నాడు.

Telugu Akira Nandan, Bro, Pawan Kalyan, Renudeshay, Tollywood-Movie

ఆ మధ్య బ్రో సినిమా( Bro movie ) ఫ్యాన్స్ షో కి హాజరు అవ్వడంతో పాటు సినీ కార్యక్రమాలకు అకీరా హాజరు అవుతున్నాడు.గతంలో అకీరా సినీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవాడు.ఇప్పుడు మాత్రం జూనియర్ పవన్ కళ్యాణ్ సందడి మొదలు అయింది.

ప్రతి సినీ కార్యక్రమంలో కూడా కనిపిస్తున్నాడు.అంతే కాకుండా ఈ మధ్య సినిమా ల కోసం అన్నట్లుగా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

దాంతో అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయిందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం అకీరా ఏజ్ దృష్ట్యా ఆలస్యం చేస్తున్నారు.

ఏదైనా మంచి సబ్జెక్ట్‌ దొరికితే వెంటనే అకీరా నందన్‌ ఇండస్ట్రీ లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Akira Nandan, Bro, Pawan Kalyan, Renudeshay, Tollywood-Movie

అకీరా తో సినిమా కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి.కనుక తప్పకుండా అకీరా కు మంచి సబ్జెట్‌ అనుకున్న వెంటనే లభిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన హడావుడి అయితే ఏమీ లేదు.2025 వరకు ఏమైనా పవన్‌ కళ్యాణ్ వారసుడు అకీరా సినిమా మొదలు అయ్యేనా చూడాలి.అకీరా నందన్ హీరో గా నటిస్తానంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ గతంలో రేణు దేశాయ్( Renu Desai ) ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

హీరో గా అకీరా నటిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు బ్రహ్మరథం పట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube