వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ విమర్శలు ఎదుర్కునే సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ( Ramgopal Varma ) ఎప్పుడూ ఎవరో ఒకరిపై సెటైర్లు వేస్తూ ఉంటారు.సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉండే రాం గోపాల్ వర్మ తనకు సంబంధం లేని విషయాల్లోనూ కలుగజేసుకుంటూ మరింత అగ్గి రాజేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఏపీ రాజకీయ అంశాలపై స్పందిస్తూ టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) ఆయన కుమారుడు నారా లోకేష్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై తరుచుగా వ్యంగ్య విమర్శలు చేస్తూ ఉంటారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అక్కడి ఎన్నికల్లో పోటీ చేసిన జన సేన పైనా.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది బిజెపితో పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలు తీసుకుంది.
వాటిలో కొన్ని చోట్ల జనసేన నాయకులలే పోటీ చేయగా, మరికొన్ని స్థానాల్లో బిజెపి నుంచి జనసేన లో చివరి నిమిషంలో చేరిన వారికి టికెట్ల ను కేటాయించారు.కొన్ని చోట్ల పవన్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.
అయితే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోవడం తో పవన్ ను టార్గెట్ చేసుకుని రాంగోపాల్ వర్మ( Ramgopal Varma ) సెటైరికల్ విమర్శలు చేశారు.
‘ పవన్ కళ్యాణ్ సార్ నీ నిజమైన అభిమానిగా ఒక సలహా ఇస్తున్నాను మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని వెంటనే దూరం పెట్టండి ” అంటూ పోస్ట్ చేశారు ఎన్ ఎం,, , ఆర్కే, వంటి వారు మీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు అలాగే కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా బాహుబలితో పోలుస్తూ ఆర్జీవి ట్వీట్ చేశారు.వర్మ చేసిన ఈ ట్వీట్ పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
.