పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) రెండు పడవల ప్రయాణం చేస్తుండగా సినిమాల్లో ఇప్పటికే ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన పవన్ రాజకీయాల్లో కూడా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని భావిస్తున్నారు.జనసేన పార్టీ ద్వారా ఏపీలో కింగ్ మేకర్ అవుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కచ్చితంగా సీఎం అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ చేతికి ప్రస్తుతం తాబేలు ఉంగరం కనిపిస్తోంది.
ఈ ఉంగరాన్ని చూసిన నెటిజన్లు, పవన్ అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఉంగరం ధరించడానికి కారణం ఏంటని చర్చించుకుంటున్నారు.
అయితే తాబేలు ఉంగరం( Turtle Ring ) ధరించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది.ఎవరైతే ఈ ఉంగరాన్ని ధరిస్తారో వాళ్లు ఆర్థికంగా, పొలిటికల్ గా మంచి ఫలితాలు పొందుతారని తెలుస్తోంది.
పవన్ చేతికి ఉన్న ఉంగరం ఎంతో మహిమ ఉన్నదని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే.పవన్ అభిమానులు సైతం పవన్ స్టైల్ ను ఫాలో అవుతారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ లీక్ కాగా ఈ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.పవన్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ మినిమం గ్యారంటీ సినిమాలు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.పవన్ నటిస్తున్న వినోదాయ సిత్తం ( Vinodhaya Sitham )రీమేక్ కు సంబంధించి త్వరలో వరుస అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ పారితోషికం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.